Healthy tips to control anger position

healthy tips, tips to control anger, healthy tips to control anger, anger persons, angry young men, healthy tips anger, anger people, tips to anger people, health tips, tips to control feelings, tips to control temptations

healthy tips to control anger position which prevents bad temptations in human beings

కోపాన్ని అదుపులో వుంచుకోవడానికి హెల్తీ టిప్స్!

Posted: 10/09/2014 03:27 PM IST
Healthy tips to control anger position

సాధారణంగా మానవులందరికీ భావోద్వేగాలు వుండటం సహజం. అవి సందర్భాలను బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా బయటకు వస్తూ వుంటాయి. సంతోష భావోద్వేగాలు ఆరోగ్యానికి చాలావరకు మంచి చేస్తాయి కాబట్టి వాటి గురించి చర్చించుకోవాల్సిన అవసరం అంతగా లేదు. కానీ కోపం లాంటి భావోద్వేగం ఆరోగ్యానికి ఎంతో హానికరం. నిజానికి మానవులు మానిసకంగా కృంగిపోతున్న సమయంలోనే కోపం వస్తుంది. అలాకాకకుండా ప్రతిచిన్న విషయాలకు కోపాద్రిక్తులైతే మాత్రం ఆరోగ్యానికి హానికరమైన సంకేతంగా నిలుస్తుంది. కోపాన్ని చాలావరకు బయటవదిలేస్తేనే మంచి కానీ.. దానిని లోపలే అణుచుకుంటే మాత్రం ఆరోగ్యానికి విషపూరితంగా మారిపోతుంది. అంటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ కోపం మానవునికి ఏదోఒకరకంగా హానికరమైన సంకేతంగానే నిలుస్తోంది. అటువంటి సమయాల్లో ఆ కోపాన్నే అదుపులో వుంచుకుంటే చాలా మంచిది. మరి ఈ కోపాన్ని అదుపులో వుంచే ఆ హెల్తీ మార్గాలేంటో ఒకసారి తెలుసుకుందాం....

1. సహజంగా కోపం అనేది కొన్ని కారణాల వల్ల వస్తుంది కాబట్టి.. అటువంటి కారకాల నుంచి దూరంగా వెళ్లిపోవడం ఎంతో ఉత్తమమైనది. ఇంట్లోవున్నవారితో వాగ్యుద్ధానికి దిగడం, ఇంకా ఇతర కారణాల వుండొచ్చు. అటువంటి సమయాల్లో కోపం వస్తుందని భావన కలిగితే.. ఆ కారకాల నుంచి దూరంగా జరిగితే చాలా మంచిది. అప్పుడు వెంటనే బయటకువెళ్లిన అనంతరం లోతైన శ్వాస తీసుకోవాలి. ఈ సిస్టమ్ లో ఎక్కువ ఆక్సిజన్ శరీరంలోకి ప్రవేశించి, కోపాన్ని చాలావరకు తగ్గించి, మెదడులో వుండే స్ట్రెస్ ను దూరంగా శాంతింపచేస్తుంది.

2. కొంతమంది తమ భావోద్వేగాలకు వ్యక్తపరచకుండా తమ మనసులోనే దాచుకుంటారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే.. ఎవరైనా నిత్యం అసంతృప్తికి గురిచేస్తే వారికి స్ట్రెయిట్ గా సమాధానం చెప్పడానికి భయపడుతుంటారు. అలాగే మనసులో వున్న కోరికలను, బాధను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అలాకాకుండా.. మనసులో వున్న భావోద్వేగాలను ఎప్పటికప్పుడు ఇతరులతో పంచుకుంటే మంచిది. అలాగే ఎవరైనా నిత్యం అసహనానికి గురిచేస్తే అటువంటివారికి స్ట్రెయిట్ గా సమాధానం చెప్పేయాలి. అలా చేయకపోతే మానసిక ఒత్తిడికి లోనయి, ఎక్కువ కోపానికి గురవుతారు.

3. ఇంట్లో తల్లిదండ్రులతో లేదా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు వివాదాలు చోటు చేసుకోవడం సహజం. ఆ సమయంలో ఎక్కువ కోపానికి గురవ్వడమే కాకుండా.. మనసులో వున్న అన్ని భావేద్వేగాలను చంపుకోవాల్సి వుంటుంది. అలా చేయడం వల్ల ఎక్కువ స్ట్రెస్ కు లోనయి అనారోగ్య పరిస్థితికి గురికావడం ఖాయం. అలాకాకుండా కోపాద్రిక్తులైన వెంటనే ఆ వాతావరణం నుంచి బయటకు వచ్చేసి వెంటనే స్నేహితులతో కలిస్తే మంచిది. వారితో గడిపిన సంతోష ఘడియలు, అల్లరి చేష్టలు వంటివి గుర్తు చేసుకుంటే.. మనసులో వుండే భావోద్వేగాలు పూర్తిగా తొలగిపోయి.. మెదడులో వుండే మొత్తం స్ట్రెస్ ఒక్కసారిగా తగ్గిపోతుంది.

4. ఎవరైనా కొంతమంది నచ్చని కొన్ని విషయాలను వెల్లడిస్తే దానికి వెంటనే కోపంగా రియాక్ట్ అవుతుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలతో తప్పుడు పనులు చేస్తుంటారు. అలా వెంటనే రియాక్ట్ కాకుండా కొద్దిసేపటివరకు కూల్ గా ఆలోచించిన అనంతరం స్పందిస్తే మంచిది. ఒకవేళ అలా కాని పక్షంలో ఏదైనా నచ్చిన పనిని అప్పటికప్పుడు నిర్వహిస్తే కోపం తగ్గే అవకాశాలు చాలా వుంటాయి. ఎక్కువ కోపానికి గురైనప్పుడు తమ భావోద్వేగాలను ఇతరుల మీద ప్రదర్శించకుండా వాటిని ఒక డైరీలోనో లేదా సోషల్ నెట్ వర్కింగ్ బ్లాగుల్లోనే పొందుపరుచుకుంటే చాలా వరకు తగ్గే అవకాశాలు వుంటాయి.

5. అన్నిటికంటే ముఖ్యమైనది ధ్యానం.. ప్రతిరోజూ ధ్యానం చేస్తే ఇది భావోద్వేగాల విషయంలో శక్తివంతమైన పట్టు సాధించడానికి దోహదం చేస్తుంది. ధ్యానం చేయడం వల్ల మెదడు చాలా ప్రశాంతంగా వుంటుంది కాబట్టి.. వెంటనే కోపం వెల్లడవ్వదు. దీంతో మానసికంగా ఎటువంటి ఒత్తిళ్లు వుండవు. పైగా శరీరం కూడా చాలా ప్రశాంతంగా వుంటుంది. ఆరోగ్యంగా వుండటానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ సమయానుకూలంగా ధ్యానం చేస్తే చాలా మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy tips  tips to control anger  human being feelings  human temptations  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more