Director Koratala Siva Confused For His Next Project | Allu Arjun News | Jr Ntr Movies

Director koratala siva jr ntr allu arjun movie confusion

koratala siva, allu arjun, jr ntr, srimanthudu, mirchi movie, mahesh babu, tollywood, telugu movies, telugu film industry

Director Koratala Siva Jr Ntr Allu Arjun Movie Confusion : Tollywood Director Koratala Siva In Dialoma For His Next Project. Actually He Prepares Story For NTR But Bunny Has Given Green Signal For That Story.

ఆ ఇద్దరి మధ్య కొర‘టాస్’ ఎవరికో?

Posted: 08/25/2015 02:04 PM IST
Director koratala siva jr ntr allu arjun movie confusion

తెలుగు ఇండస్ట్రీలో రచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ.. ‘మిర్చి’ సినిమాతో డైరెక్టర్ గా అవతారమెత్తాడు. అప్పటికే రైటర్ గా మంచి పేరు సంపాదించిన ఆయన.. ‘మిర్చి’ ఘనవిజయం సాధించడంతో డైరెక్టర్ గానూ మార్కులు కొట్టేశారు. ఇక ఆ చిత్రం తర్వాత ఆయన ప్రిన్స్ మహేష్ బాబుతో జతకట్టి ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని రూపొందించారు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, దాన్ని అభివృద్ధి ఎలా చేయాలోనన్న అంశంతో తెరకెక్కిన ఆ చిత్రం ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సినిమా ఆయన్ను మరింత వెలుగులోకి తీసుకువచ్చింది. కొత్తదనంతో శివ ప్రేక్షకుల ముందుకు రావడంతో.. ఇప్పుడు చాలామంది కథానాయకులు ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ హీరోల పేర్లు తెరమీదకి వచ్చాయి. అందులో ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాగా, మరొకరు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరిలో ముందుగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటే.. ఇటీవలే ఈ స్టైలిష్ హీరో కొరటాల శివతో మాట్లాడినట్లు తెలిసింది. ఆ సందర్భంగానే శివ వినిపించిన కథ తనకి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పడంతోపాటు అడ్వాన్స్ కూడా ఇచ్చి పంపించినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు షికార్లు చేస్తున్నారు. అయితే.. కొరటాల మాత్రం ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేసుకుని రెడీగా వున్నాడని మరో వార్త కొన్ని రోజుల నుంచి చక్కర్లు కొడుతోంది. ‘శ్రీమంతుడు’ సినిమా హిట్ కావడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా శివ దర్శకత్వంలో చేయాలని భావించాడని, అందుకే అతనికి ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. కానీ.. ఇంతలోనే అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి, శివకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బోయపాటితో ఇతను తీస్తున్న సినిమా కంప్లీట్ అయిన వెంటనే శివ సినిమా పట్టాలెక్కొచ్చని అంటున్నారు.

ఈ విధంగా వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం కొరటాల శివ మాత్రం ఆ ఇద్దరి హీరోల మధ్య ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ కోసం తాను కథను తయారుచేసుకోగా.. ఇంతలోనే బన్నీ ఎంట్రీ కావడంతో శివ కాస్త డైలామాలో పడిపోయినట్లు చెప్పుకుంటున్నారు. ఇంతకీ శివ ముందుగా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : koratala siva  allu arjun  jr ntr  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more