Tollywood Distributors Showing Interest On Pawan Kalyan's Sardar Gabbar Singh Which Is On Set

Pawan kalyan sardar gabbar singh movie rights distributors

pawan kalyan, sardar gabbar singh, gabbar singh 2, pawan sardar movie, sardar movie first look, sardar gabbar singh movie updates, pawan kalyan updates, pawan kalyan news, pawan controversies

Pawan kalyan Sardar Gabbar Singh Movie Rights Distributors : Tollywood Distributors Showing Interest On Pawan Kalyan's Sardar Gabbar Singh Which Is On Set.

పవన్ కల్యాణ్ ‘పవర్’ అటువంటిది మరీ..?

Posted: 08/22/2015 01:01 PM IST
Pawan kalyan sardar gabbar singh movie rights distributors

పవన్ కల్యాణ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరుకు ఎంత పవరుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ పేరు కేవలం ఆయన అభిమానుల్నే కాదు.. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ని సైతం ఓ మంత్రంలా ప్రభావితం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పేరు టాలీవుడ్ కి బ్రాండ్ లాంటిది. అందుకే.. ఆయన సినిమాలకి ఇండస్ట్రీలో భారీ డిమాండ్ వుంటుంది. ఆమధ్య ‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలకు ముందే పైరసీ వచ్చినప్పటికీ.. ఆ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించిందంటే పవన్ మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంత క్రేజ్ వుండటం వల్లే ఈయన సినిమాలకు ఓ రేంజులో ప్రభంజనం సృష్టిస్తుంటాయి.

ఇప్పుడు తాజాగా రూపొందుతున్న ‘సర్దార్’ సినిమా కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న ‘సర్దార్’ సినిమా బిజినెస్ వ్యవహారాలు అప్పుడు మొదలయ్యాయయని సమాచారం. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే! ఆ పోస్టర్ కి ఇండస్ట్రీ వైడ్ గా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇది ‘గబ్బర్ సింగ్’ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతుండటంతో, ఆ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లను రాబడుతుందనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లు రైట్స్ కొనేందుకు పెద్ద సంఖ్యలో ఉత్సాహాన్ని చూపుతున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అది కూడా భారీగా డబ్బులు ముట్టజెప్పేందుకు వారు సిద్ధంగా వున్నారని తెలుస్తోంది.

నిజానికి ఈ చిత్రం ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సింది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ షూటింగ్ లో పాల్గొనడానికి కొంత సమయం పట్టింది. ఇక ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం, పవన్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనడం చూస్తుంటే.. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది. దీంతో ఈ చిత్రానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇంకా సినిమా సగం షూటింగ్ పూర్తికాకుండానే, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారనంటే.. పవన్ పవరేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sardar gabbar singh  pawan kalyan  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more