Shuttler Kidambi Srikanth wins 21-19, 21-19 to move into quarters

Shuttler srikanth enters olympic quarters after an impressive win

live badminton score, kidambi srikanth india live badminton, kidambi srikanth live badminton match, srikanth vs jorgensen live, srikanth jorgensen live score, srikanth jorgensen live streaming, live india badminton, live india badminton score, live badminton streaming, badminton olympics live, badminton live updates, kidambi srikanth live, olympics live, olympics news

Kidambi Srikanth beat World No 5 Jan O Jorgensen of Denmark 21-19, 21-19 to move into the quarterfinals of the men's singles event.

రియో ఒలంపిక్స్ క్వార్టర్స్ లోకి కిదాంబి శ్రీకాంత్

Posted: 08/15/2016 07:51 PM IST
Shuttler srikanth enters olympic quarters after an impressive win

రియో ఒలంపిక్స్ లో భారత్ క్రీడాకారులందరూ ఎలాంటి పతకాలను సాధించకుండా రిక్త హస్తాలతో ఒక్కోక్కరుగా వెనుదిరుగుతున్న నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ మాత్రం విజయం దిశగా ఒక్కో మెట్టూ అధిరోహిస్తూ భారత క్రీడాభిమానుల్లో కొత్త ఆశలను రేపుతున్నాడు. ఇప్పటికే సానియా-బోపన్నా జోడి కాంస్య పతకం కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో కిదాంబి కూడా వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇందుకోసం తాజాగా ఆయన మరో విజయం సాధించాడు.

మెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్ క్రీడాకారుడు జాన్ జోర్గెన్‌సన్‌పై విజయం సాధించిన శ్రీకాంత్.. క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. రెండు వరుస సెట్లను శ్రీకాంత్ 21-19, 21-19 తేడాతో గెలుచుకున్నాడు. తొలిరౌండ్‌లో ఆది నుంచి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయిన శ్రీకాంత్.. రెండో రౌండ్‌లో తొలుత వెనుకబడినా తరువాత పుంజుకొని విజయం సాధించాడు. భారత క్రీడాకారులు ఒక్కొక్కరుగా ఒలింపిక్స్ నుంచి నిరాశగా వెనుదిరుగుతున్న తరుణంతో శ్రీకాంత్ పతకంపై ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారుడు లిన్ డాన్‌తో శ్రీకాంత్ తలపడతాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidambi srikanth  quarters  rio olympics  badminton  

Other Articles