In battle of 10-rounds, experienced Kerry Hope takes on home favourite Vijender Singh

Kerry hope vows to chop down vijender singh in wbo title bout

vijender singh, wbo asia pacific super middleweight title, wbo asia pacific, middleweight title, boxing, sports, boxing news

Hope was after all simultaneously preparing to fight Vijender Singh for the WBO Asia Pacific super middleweight title.

డబ్యూబివో టైటిల్ బిగ్ డీల్ కాదు: విజేందర్ సింగ్

Posted: 07/12/2016 06:48 PM IST
Kerry hope vows to chop down vijender singh in wbo title bout

ప్రోఫెషనల్ బాక్సర్ గా బరిలోకి దిగిన తరువాత అప్రతిహాత విజయాలతో మున్ముందుకు దూసుకుపోతున్న భారత ప్రోఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తన తదుపరి బౌట్ ను తన నెక్ట్స్ టార్గెట్ స్వీకరించి ముందుకు వెళ్తున్నానన్నాడు. తనకు డబ్యూబీవో ఆసియా టైటిల్ బౌట్ అనేది ఎంతమాత్రం బిగ్ డీల్ కాదని సింగ్ స్పష్టం చేశాడు. ఈ పోరును సాధారణ బౌట్ గా మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నట్లు విజేందర్ పేర్కొన్నాడు. తన కెరీర్ లో పాల్గొన్న బాక్సింగ్ బౌట్ ల మాదిరిగానే,  డబ్యూబీవో బౌట్ ను కూడా చూస్తున్నట్లు తెలిపాడు.
 
' నేను వరుసగా ఆరు ప్రొ బాక్సింగ్ బౌట్లు గెలిచా. అదే తరహాలో ఇది నాకు మరొక బౌట్. ఇప్పుడు నేను ప్రొ బాక్సర్ ని. అలానే తదుపరి బౌట్ కు సిద్దమవుతున్నా'  అని విజేందర్ అన్నాడు. శనివారం జరిగే పోరుతో తన బాక్సింగ్ కెరీర్ ఏమీ ముగిసిపోదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ తో జరిగే ఆ బౌట్ హోరాహోరీగా జరిగినా, మిగతా ఫైట్ తరహాలోనే ఈ పోరును కూడా చూస్తానన్నాడు. రింగ్ లోకి వెళ్లాక విజయంపైనే తన దృష్టి ఉంటుందన్నాడు. ఆ బౌట్ ముగిశాక మరో బౌట్ పై దృష్టిపెడతానని విజేందర్ పేర్కొన్నాడు.

తన బౌట్లను ఉద్యోగంతో పోల్చిన విజేందర్.. ఈ పోరుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు తెలిపాడు. డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం జూలై 16న  స్థానిక త్యాగరాజ స్టేడియంలో విజేందర్ -హోప్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉన్న హోప్... ఇప్పటిదాకా తను 30 బౌట్లలో రెండు నాకౌట్‌లతో పాటు 23 విజయాలను సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijender Singh  WBO title  kerry hope  boxing  

Other Articles