Boxer Shiva Thapa Settles For Bronze Medal Only In World Boxing Championship | Rio 2016 Hunt

Boxer shiva thapa settles for bronze medal in world boxing championship

boxer shiva thapa, shiva thapa updates, rio 2016 championship, world boxing championship, asian games, shiva thapa wikipedia

Boxer Shiva Thapa Settles For Bronze Medal In World Boxing Championship : Asian bronze medal-winning pugilist Shiva Thapa fought his heart out but still fell short in a draining contest, settling for a bronze medal at the World Boxing Championships in Doha on Sunday, but he remained in contention for a Rio 2016 Olympics berth.

చివరిదాకా పోరాడాడు.. కాంస్యంతో సరిపెట్టుకన్నాడు..

Posted: 10/12/2015 06:40 PM IST
Boxer shiva thapa settles for bronze medal in world boxing championship

ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో మొదటి నుంచి తన ప్రతిభతో సెమీ ఫైనల్ వరకు దూసువెళ్లిన భారత యువ బాక్సర్ శివ థాపా... చివరికి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 56 కేజీల విభాగంలో పోటీపడ్డ శివ.. మొదటి మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. దీంతో.. గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ కచ్చితంగా గెలుస్తాడనే నమ్మకాలు వెలువడ్డాయి. కానీ.. సెమీ ఫైనల్ పోరులో ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలవ్వడంతో ఆ బాక్సర్ కి కాంస్యం పతకమే చేజిక్కించుకోవాల్సి వచ్చింది. సోమవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో 1-2 తేడాతో ఉజకిస్థాన్ బాక్సర్ మురోద్జోన్ అఖ్మాదాలీవ్ చేతిలో థాపా పరాజయం పాలయ్యాడు.

అయితే.. ఈ పోరులో తృటిలో విజయాకాశాన్ని కోల్పోయినా..  రియో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్ రేస్ లో మాత్రం నిలిచాడు. మరో సెమీ ఫైనల్లో ఓటమి పాలైన దిమిర్తీ అసునౌ తో జరిగే పోరులో శివ థాఫా విజయం సాధిస్తే రియోకు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ కేటగిరి నుంచి ముగ్గురు బాక్సర్లను అక్టోబర్ 15వ తేదీన రియో ఒలింపిక్స్ కు ఎంపిక చేయనున్నారు. అంతకుముందు శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శివ థాపా 3-0తో హకన్ ఎర్సెకర్ (ఖతార్)పై గెలుపొంది పతకం ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో  ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారతీయ బాక్సర్‌గా శివ థాపా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011) కాంస్య పతకాలు సాధించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : boxer shiva thapa  rio 2016 olympic games  world boxing championship  

Other Articles