Jwala Gutta Ashwini Ponnappa Wins Canada Open | Jwala Ashwini beat Dutch duo Selena Piek Eefje Muskens

Jwala gutta ashwini ponnappa wins canada open beat dutch duo selena piek eefje muskens

jwala gutta, ashwini ponnappa, canada open, jwala gutta latest news, jwala gutta updates, jwala gutta canada open, ashwini ponnappa canada open, jwala gutta photo shoot, ashwini ponnappa photo shoot,

Jwala Gutta Ashwini Ponnappa Wins Canada Open beat Dutch duo Selena Piek-Eefje Muskens : Indian shuttlers Jwala Gutta and Ashwini Ponnappa won the Canada Open women's doubles title after upstaging the top-seeded Dutch pair of Eefje Muskens and Selena Piek in the summit clash here.

‘కెనడా ఓపెన్’లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిన జ్వాల-పొన్నప్ప

Posted: 06/29/2015 11:23 AM IST
Jwala gutta ashwini ponnappa wins canada open beat dutch duo selena piek eefje muskens

గతకొన్నాళ్ల నుంచి పేలవ ప్రదర్శనతో భారతీయ అభిమానులను నిరాశపపరిచిన గుత్తాజ్వాల-అశ్విని పొన్నప్ప జోడి.. కెనడా ఓపెన్ లో తమ సత్తా చాటుకున్నారు. ఆ టోర్నమెంట్ లో భాగంగా డచ్ కు చెందిన సెలీనా పీక్-ఈఫ్జే ముస్కెన్ ప్రత్యర్థి జోడీని వారిద్దరు తమ ఆటతీరుతో ముచ్చెమటలు పట్టించారు. వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. చివరికు ఈ పోటీలో ఇండియన్ షట్లర్లే విజయపతకాన్ని ఎగరవేశారు. ఈ కెనడా ఓపెన్ లో భారత మూడో సీడ్ జోడీ 21-19, 21-16 పాయింట్లతో గెలుపొందారు.

ఆట మొదలైన మొదటి రౌండ్లో ఈ రెండు జోడీల మధ్య ఉత్కంఠభరితమైన పోటీ సాగింది. ముఖ్యంగా చివరి 35 నిముషాలు వీరిమధ్య పోరాటం ఎంతో ఉత్కంఠగా సాగింది. మొదటి నుంచి ఒకరికొకరు పోటీగా ఈ రెండు జట్లు 19-19 పాయింట్ల వరకు చేరుకున్నారు. అయితే.. ఈ సమయంలో ఇండియన్ జోడీ కాస్త పుంజుకొని.. ప్రత్యర్థులకు ధీటైన సమాధానం ఇచ్చారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చివరి రెండు పాయింట్లను తమ ఖాతాలో వేసుకుని.. మొదటి రౌండ్ ని సునాయాసంగా గెలుపొందారు.

ఇక రెండో రౌండ్ లో భాగంగా మొదట్లో ఇండియన్ జోడీ బాగానే దూసుకెళ్లింది. 5-0 పాయింట్ల లీడింగ్ తో కొనసాగింది. అయితే.. ప్రత్యర్థులు కాస్త పుంజుకుని తమ ప్రతిభను కనబర్చారు. దీంతో ఒక దశలో 10-6 పాయింట్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఇండియన్ జోడీ తమ వేగాన్ని పెంచి, 15-6 తో దూసుకెళ్లారు. కానీ.. ఇంతలోనే వీరికేమైందో తెలీదు కానీ.. ప్రత్యర్థి చేతుల్లో వరుసగా పాయింట్లు కోల్పోయారు. ఒకానొక దశలో 15-15 పాయింట్లు నమోదయ్యాయి. ఈ రెండో రౌండ్ ప్రత్యుర్థులదే గెలపు అని భావించారు.

కానీ.. అందరి అంచనాలను దాటవేస్తూ గుత్తా-పొన్నప్ప తమ ప్రతిభతో ముందుకు దూసుకెళ్లారు. ప్రత్యర్థులపై తమ విశ్వరూపం ప్రదర్శించారు. ప్రత్యర్థుల స్కోరు 15కు మంచి పెరగనివ్వకుండా వరుసగా పాయింట్లను తమ ఖాతాలో జమ చేసుకున్నారు. దీంతో చివరగా 21-16 పాయింట్లో ఇండియన్ జోడీ అద్భుతంగా గెలుపొందింది. 2012 లండన్ ఒలంపిక్స్ లో గెలుపొందిన అనంతరం గుత్తా-పొన్నప్ప ఇన్నాళ్లకు ఓ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jwala gutta  ashwini ponnappa  canada open  

Other Articles