Gowda, Punia recommended for Khel Ratna; Jaisha for Arjuna

Gowda in line for khel ratna jaisha for arjuna

M R Poovamma, Arpinder Singh, Arjuna Award, Vikas Gowda, recommended, Khel Ratna, Seema Punia, O.P. Jaisha, Athletics Federation of India, AFI, Commonwealth Games gold medallist discus thrower Vikas Gowda, Rajiv Gandhi Khel Ratna, CWG silver winner Seema Punia, Jaisha for Arjuna award, Common wealth Games, gold medallist, discus thrower, Vikas Gowda

Commonwealth Games gold medallist discus thrower Vikas Gowda has been recommended for the Rajiv Gandhi Khel Ratna for the second time, along with his female counterpart and CWG silver winner Seema Punia.

రాజీవ్ ఖేల్ రత్న అవార్డుల రేసులో గౌడ, సీమ

Posted: 05/07/2015 05:35 PM IST
Gowda in line for khel ratna jaisha for arjuna

కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత, స్టార్‌ డిస్కస్‌ త్రోయర్‌ వికాస్‌ గౌడ.. క్రీడా అత్యున్నత పురస్కారం ఖేల్‌ రత్న రేసులో ఉన్నాడు. వికాస్‌తోపాటు మహిళా డిస్కస్‌ త్రోయర్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌ రజత పతక విజేత సీమ పూనియా పేరును కూడా భారత అథ్లెటిక్‌ సమాఖ్య ఖేల్‌రత్నకు సిఫారసు చేసింది. గతేడాది ఇంచియాన్‌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో వికాస్‌ రజతంతో, సీమ స్వర్ణంతో మెరిసిన నేపథ్యంలో వీరిద్దరి పేర్లను ఖేల్‌ రత్న అవార్డుకు సిఫారసు చేయాలని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది.

గౌడ, సీమతోపాటు పారాథ్లెట్లు హెచ్‌ఎన్‌ గిరీశ, దేవేంద్ర జజారియా పేర్లను కూడా ఖేల్‌ రత్న కోసం ఏఎఫ్‌ఐ క్రీడాశాఖకు ప్రతిపాదించింది. 2013 ఐపీసీ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో జజారియా జావెలిన్‌ ఎఫ్‌-46 విభాగంలో స్వర్ణం సాధించాడు. 2004లో ఏథెన్స్‌ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌ గేమ్స్‌లోనూ అతడు పసిడి పతకం నెగ్గాడు. ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఏఎఫ్‌ఐతో పాటు రాజస్థాన్‌ ప్రభుత్వం కూడా జజారియా పేరును సిఫారసు చేసింది. కర్ణాటకకు చెందిన గిరీశ 2012లో లండన్‌ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌ హై జంప్‌ ఎఫ్‌-42 విభాగంలో రజతం సాధించాడు.

కాగా, ఖేల్‌ రత్న అవార్డు కోసం గతేడాది కూడా వికాస్‌ గౌడ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ షార్ట్‌లిస్ట్‌ చేసినప్పటికీ సెలెక్షన్‌ ప్యానెల్‌ క్రీడాకారులెవరికీ ఈ అవార్డును ప్రకటించలేదు. ఇక అర్జున అవార్డు కోసం రన్నర్‌ పూవమ్మ, ట్రిపుల్‌ జంపర్‌ అర్పీందర్‌ సింగ్‌, మిడిల్‌ డిస్టన్స్‌ రన్నర్‌ జైశాతో పాటు సీమ పేరును కూడా ఏఎఫ్‌ఐ ప్రతిపాదించింది. కాగా, ఖేల్‌రత్న, అర్జున అవార్డుల ఎంపిక ప్రక్రియలో గత మూడేళ్ల కాలంలో క్రీడాకారుల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khel ratna  arjuna award  Vikas Gowda  Seema Punia.  

Other Articles