Indian boxer manoj kumar counter attack former cricketer kapil dev arjuna award function

indian boxer manoj kumar, boxer manoj kumar news, boxer manoj kumar arjuna award, arjuna award winners, manoj kumar arjuna award, former cricketer kapil dev, kapil dev latest news, kapil dev arjuna award news, manoj kumar kapil dev

indian boxer manoj kumar counter attack former cricketer kapil dev arjuna award function

కపిల్’దేవ్’పై మనోజ్ పంచ్ పలక్’నమా!

Posted: 11/27/2014 11:52 AM IST
Indian boxer manoj kumar counter attack former cricketer kapil dev arjuna award function

1983లో ఇండియాకు వరల్డ్’కప్ సాధించి పెట్టిన భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్’దేవ్’పై భారత మేటి బాక్సర్ మనోజ్ కుమార్ పంచ్’లతో ధ్వజమెత్తాడు. కపిల్ తనకిచ్చిన ఝలక్’కి ఖంగుతిన్న మనోజ్.. తనదైన ఆ మాజీ క్రికెటర్’కి సమాధానమిచ్చాడు. ఓ కార్యక్రమం నేపథ్యంలో అనుకోకుండా భేటీ అయిన ఇద్దరూ.. మాటల తూటాలతో ఒకరిమీదొకరు కామెంట్లు చేసుకున్నారు. అయితే అదంతా పెద్ద వివాదాస్పదమైతే కాలేదులెండి. అసలు మేటర్ ఏంటో అర్థం కావడం లేదు కదూ.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే!

కామన్వెల్త్ గేమ్స్’లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ మనోజ్ కుమార్... ‘‘అర్జున’’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రక్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఈ హర్యానా ప్లేయర్’కి ఆ పురస్కారాన్ని అందజేశారు. అయితే గతంలో ఈ అవార్డుకు సంబంధించి మనోజ్’కు, కపిల్’దేవ్ మధ్య సంభాషణ జరిగింది. ఆ సమయంలో ‘‘నువ్వు ఎవరో నాకు తెలీదు’’ అని అన్నారు. దాంతో కాస్త నిరాశకు గురైన మనోజ్.. పురస్కారాన్ని అందుకున్న తర్వాత తనదైన శైలిలో కపిల్’కు తనెవరో సమాధానమిచ్చాడు. ‘‘ఈ రోజు కపిల్‌కు ఒక మాట చెప్పదల్చుకున్నా. నా పేరు మనోజ్ కుమార్. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్‌ను’’ అని వ్యాఖ్యానించాడు.

అలాగే తాను అవార్డులను అందుకోవడంలో ఎంత కష్టపడాల్సిందో వివరించాడు. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ.. ‘‘నేను సాధించిన విజయాలకు సులువుగా రావాల్సిన అవార్డును ఎంతో కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. నా ఘనతలను బట్టి చూస్తే ఈ అవార్డుకు నేను అర్హుడిని. డోపింగ్ విషయంలో ఎవరో నాపై వ్యతిరేక ఆరోపణలు చేశారు. అయితే అదంతా అబద్ధం. అర్జున జాబితా నుంచి నా పేరు తొలగించి కాంస్యం గెలిచిన వారికి అవార్డు ఇస్తున్నారని కపిల్‌కు గుర్తు చేశా. అయితే ఇలాంటి విషయాలు నాతో మాట్లాడొద్దని ఆయన ఫోన్ కట్ చేశారు’’ అని మనోజ్ పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian boxer manoj kumar  arjuna award function  kapil dev  telugu news  

Other Articles

Today on Telugu Wishesh