Mary kom won gold medal in asian games

mary kom, mary kom wiki, mary kom latest, mary kom news,mary kom photos, mary kom family, mary kom hot, mary kom hot photos, mary kom medals, mary kom in asain games, asian games, asian games wiki, asian games schedule, asian games 2014, inchian, asian games indian athlets, country wise medals in asian games, sports news, latest news, india

indian boxer mary kom won gold medal in asian games 2014 : again mary kom shined with gold medal in asain games boxing finals 48-51kgs stream

మణిపురి ముత్యం మెరిసింది విశ్వ విజేతగా మేరికోమ్

Posted: 10/01/2014 03:41 PM IST
Mary kom won gold medal in asian games

బాక్సింగ్ ఛాంపియన్ మేరికోమ్ మళ్ళీ సత్తా చాటింది. భారత పతకాన్ని ప్రపంచ క్రీడల్లో రెపరెపలాడించింది. భారత మహిళ సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. మినీ ఒలంపిక్స్ గా భావించే ఆసియాగేమ్స్ లో బంగారు పతకం గెలుచుకుంది. స్వర్ణం గెలిచి భారతపతాకాన్ని ముద్దాడింది. 48-51కేజీల మహిళల ఫ్లై వెయిట్ విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కజకిస్థాన్ బాక్సర్ జియానా శెఖర్ బెకోవాను ఓడించింది. గత ఆసియా క్రీడల్లో కూడా మేరికోమ్ స్వర్ణం కైవసం చేసుకుంది.

ఆసియా గేమ్స్ లో తొలి నుంచి మేరికోమ్ సత్తా చాటుతోంది. సోమవారం జరిగిన సెమీస్ లో ప్రత్యర్ధిని చిత్తుచేసిన కోమ్.. మంగళవారం జరిగిన ఫైనల్ లో కూడా అంతే ప్రతిభ కనబర్చింది. దీంతో కజకిస్థాన్ బాక్సర్ ఖంగుతిన్నది. భారతమాత మెడలో పతకాలను తెచ్చి వేస్తున్న మేరికోమ్ ప్రతిభపై కేంద్రం సంతోషం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో కూడా కోమ్ ఇలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆశిస్తున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అటు అభిమానులు, మణిపుర్ వాసులు తాజా విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాగ్నిఫికెంట్ మేరీగా పేరు తెచ్చుకున్న సాదాసీదా భారతీయ గృహిణిగురించి తెలుసుకుందాం.

కొండ ప్రాంతం అయిన మణిపుర్ రాష్ర్టంలో పుట్టి... కండలు పెంచిన మహిళగా మేరికోమ్ ప్రపంచ గుర్తింపు పొందింది. ఒలంపిక్స్ లో పతకం సాధించటంతో అందరి దృష్ఠి ఆమెపై పడింది. మేరి కోమ్ జీవితం తెలుసుకున్నవారంతా.. ఒక పేద మహిళ ప్రపంచ క్రీడల్లో ప్రతిభ చూపిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంతోమంది మేరికోమ్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు. కేవలం కుటుంబ పోషణ కోసం క్రీడల్లోకి ప్రవేశించింది. కట్టుబాట్లు, సాంప్రదాయాలతో పాటు, వెనకబాటుతనం ఉండే మణిపుర్ రాష్ర్టంలో ఒక మహిళ క్రీడల్లోకి వచ్చి అది కండ బలం కావాల్సిన బాక్సింగ్ లోకి వచ్చి సంచలనమే రేపింది. ఇది ఒక విప్లవానికి నాంది వేసింది.

31ఏళ్ళ మేరికోమ్ ప్రారంభంలో అన్ని ఆటలు ఆడింది. ఇలా వివిధ క్రీడల్లో పలు పతకాలు కూడా సాధించింది. ఆ తర్వాత క్రమంగా బాక్సింగ్ వైపు దృష్టి మరలి శిక్షణ తీసుకుంది. ఇలా 2000 సంవత్సరంలో మణిపుర్ రాష్ర్టంలో మహిళా బాక్సింగ్ పోటిల్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఈస్ట్ ఇండియా పోటిల్లో కూడా విజయం సాధించింది. ఆ తర్వాత 2005 వరకు అనేక పోటిల్లో పాల్గొని పతకాలను గెలుచుకుంది. ఆమె ప్రతిభను పేపర్లో వచ్చిన ఫొటోను చూసి తల్లితండ్రులు తెలుసుకున్నారు. అప్పటివరకు వారికి మేరి కోమ్ బాక్సింగ్ చాంపియన్ అనే విషయమే తెలియదు.

మేరికోమ్ జీవితంలో అంతా విజయాలు, సక్సెస్ బాటలే అనుకుంటే పొరపాటే. నాణెంకు ఒక వైపు ఆమె చాంపియన్ అయితే అవతలి వైపు సాధారణ మహిళ. మొదట్లో కుటుంబ ఆర్ధిక పరిస్థితులు అంతగా అనుకూలించలేదు. దీనికితోడు అసోసియేషన్ లో రాజకీయాలు. వివాదాలు, వివక్షలు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంది. ఇక పెళ్లి, పిల్లల కారణంగా కొంతకాలం బాక్సింగ్ కు దూరంగా ఉంది. భర్త సహకారంతో మళ్ళీ శిక్షణ మొదలెపెట్టింది. ఓ సారి పోటిల కోసం రైలులో వెళ్తుంటే బ్యాగు, పాస్ పోర్ట్ ఎవరో కొట్టేశారు. ఈ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయినా పోటిలకు వెళ్ళింది.

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.., ఎంచుకున్న లక్ష్యం కోసం ముందుకు కదిలింది. లక్ష్యం ముందు ఇబ్బందులు అన్నీ చిన్నవి అయిపోయాయి. ఆమె జీవితం అందరికి ఆదర్శప్రాయం. అందుకే బాలీవుడ్ లో మేరికోమ్ పేరుతో సినిమా కూడా వచ్చింది. ఇది సక్సెస్ సాధించింది. సాధారణ భారతీయ మహిళ జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపారు. ఇలా ఎందరికో ఆదర్శప్రాయం అయిన మేరికోమ్.., భవిష్యత్తులో కూడా భారత్ కు మరిన్ని పతకాలను తీసుకురావాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asian games  mary kom  latest news  sports  

Other Articles