Argentina beats netherlands in penalty shoot out

Argentina beats Netherlands, penalty shoot-out, Argentina Vs Netherlands semi final, Argentina beats Netherlands 4-2

Argentina beats Netherlands in penalty shoot-out

ఫైనల్లో అర్జెంటీనా జట్టు 24 ఏళ్ళ తరువాత

Posted: 07/10/2014 12:57 PM IST
Argentina beats netherlands in penalty shoot out

సాకర్ ప్రపంచకప్ లో నెదర్లాండ్ ను ఫెనాల్టీ షూటౌట్ తో బొల్తా కొట్తించి, ఎన్నో ఏళ్ల తరువాత ఫైనల్ కి చేరి కప్ ని కైవసం చేసుకోవడానికి జర్మనీతో అమీ తుమీకి సిద్దం అయింది.  ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో తలపడ్డ అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్లు నువ్వా నేనా అన్నట్లు పట్టువీడకుండా ఆటను అదనపు సమయానికి తేవడంతో పాటు, పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా 4 గోల్స్ కొట్టగా, నెదర్లాండ్స్ 2 గోల్స్ మాత్రమే కొట్టడంతో విజయం అర్జెంటీనాను వరించింది.

తొంబై నిమిషాల పాటు ఇరు జట్లు హోరా హోరీగా పోరాడినా, గోల్స్ చేయడానికి అద్బుత అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యాయి. దీంతో ఫెనాల్టీ షూటౌట్ కావాల్సి వచ్చింది. పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా గోల్ కీపర్ రోమెరో నెదర్లాండ్స్ ఆటగాడు వార్ల్ కొట్టిన తొలి గోల్ ని అడ్డు కోవడంతో అర్జెంటీనాకు ఆధిక్యం లభిచింది.

పెనాల్టీ షూట్ ఔట్ లో... అర్జెంటీనా తరపున మెస్సీ, గరాయ్, ఆగ్యురో, రోడ్రోగెయిజ్ గోల్స్ కొట్టారు. నెదర్లాండ్స్ తరపున రాబెన్, కుయుట్ గోల్స్ కొట్టడంలో సఫలీకృతం కాగా... వ్లార్, స్నైడర్ లు విఫలమయ్యారు. దీంతో, 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ఫెనాల్టీ షూట్లను అడ్డుకున్న అర్జెంటీనా గోల్ కీపర్ రోమెరోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ లభించింది. అర్జెంటీనా విజయంతో ఆదేశం ఆనందంలో మునిగిపోయింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles