Belgium beat usa to set up quarterfinal

belgium in quarter finals in fifa world cup, fifa world cup 2014, fifa world cup quarter-finals, world cup quarter-finals 2014

belgium in quarter finals in fifa world cup,

ఫిఫా నుండి అమెరికా ఔట్ … క్వార్టర్స్ కి బెల్జియం

Posted: 07/03/2014 12:30 PM IST
Belgium beat usa to set up quarterfinal

అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిపా వరల్డ్ కప్ కోసం ఎనమిది జట్లు తలపడుతున్నాయి. కప్ కోసం అగ్ర రాజ్యం  అమెరికా ప్రీ క్వార్టర్స్ లో బెల్జియంతో హోరా హోరీగా పోరాడి 2-1 తేడాతో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. హోరాహోరీ పోరాటాలకు వేదికగా నిలిచిన ప్రపంచకప్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ లో చాలా కాలం తరువాత బెల్జియం క్వార్టర్స్ బెర్తును ఖరారు కోసం చెలరేగి ఆడింది.

ఈ మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడు ప్రదర్శిస్తూ అమెరికాపై 2-1 గోల్స్‌తో విజయం సాధించింది. నిర్ణీత 90 నిమిషాలలో ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా నమోదు చేయకపోవడంతో అదనపు సమయానికి దారి తీశాయి. అదనపు టైంలో బెల్జియం ఆటగాళ్లు కెవిన్ డి బ్రూనే (93వ నిమిషం), రుమేలు లుకాకు (105వ నిమిషం)లు వరుస గోల్స్‌తో తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించారు. అయితే 107వ నిమిషంలో జులియన్ గ్రీన్ సాధించిన ఏకైక గోల్‌కే పరిమితమైన అమెరికా.. టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

అమెరికా ఓడినా.. బెల్జియం దాడుల్ని సంచలన రీతిలో తిప్పికొట్టిన గోల్‌కీపర్ హోవార్డ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’గా నిలిచాడు. నేను ఒక్కడిని ఒక్కవైపు.... బెల్జియం జట్టంతా ఒక్కవైపు అన్నట్లుగా బెల్జియం ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తుంటే హోవార్డ్ గోడలా నిలిచాడు. మ్యాచ్ మొత్తం దాడుల్ని అసాధారణ రీతిలో తిప్పికొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించాడు. ఈయన ప్రదర్శనను మెచ్చుకుంటూ ఫ్యాన్స్ 20 లక్షల ట్వీట్లు చేశారంటే ఈయన ప్రదర్శన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles