Indian opener Prithvi Shaw, during a recent interaction, spilt beans regarding how a piece of advice from Sachin Tendulkar helped him to build his batting technique. Shaw made the claims in an Instagram Live session, in his bid to interact and engage with his fans.

Prithvi shaw reveals how sachin tendulkar s advice helped him in batting

Coronavirus outbreak, Ravi Shastri, COVID19, Coronavirus outbreak, Ravi Shastri, Coronavirus, Shastri Fights COVID19, Ravi Shastri Video, Indian cricket team, cricket match, today cricket match, cricket score, cricket news, cricket, sports news, sports

Indian opener Prithvi Shaw, during a recent interaction, spilt beans regarding how a piece of advice from Sachin Tendulkar helped him to build his batting technique. Shaw made the claims in an Instagram Live session, in his bid to interact and engage with his fans.

ఒత్తిడనిపించినా.. సచిన్ లా అడేటం ఒక ఛాలెంజ్: షా

Posted: 04/22/2020 06:45 PM IST
Prithvi shaw reveals how sachin tendulkar s advice helped him in batting

మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన ఆరాద్య క్రికెటర్ అని ఆయన తరహాలో తాను ఆడటానికి ప్రయత్నిస్తానని టీమిండియా యువ బ్యాట్స్ మన్‌ పృథ్వీషా అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఇన్ స్టాగ్రామ్‌ లైవ్ లో షా ముచ్చటించాడు. సచిన్‌ ప్రభావం తనపై ఎంతో ఉందన్నాడు. ఎనిమిదేళ్ల వయసులో తొలిసారి ఆయనను కలిశానని, పరిస్థితులని బట్టి ఎప్పుడు సాధారణ శైలిలోనే ఆడమని ఎప్పుడూ సలహా ఇచ్చేవారని చెప్పాడు. గ్రౌండ్ బయట కూడా ప్రశాంతగా ఉండమని చెప్పేవారు. తాను బోటమ్‌-హ్యాండ్‌ ప్లేయర్‌నని.. కోచ్‌ల సూచనల మేరకు గ్రిప్‌ను మార్చానని, అయితే ఎప్పుడైతే సచిన్‌ తన గ్రిప్‌ను మార్చవద్దని సూచించారో ఆ తర్వాత నుంచి మార్చలేదుని తెలిపాడు.

తనని సచిన్ తో పోలిస్తే ఒత్తిడికి గురవుతుంటానని, అయితే అది ఛాలెంజ్ గా అనిపిస్తుంటుందని పృథ్వీ అన్నాడు. సచిన్ క్రికెట్ దేవుడు అని కొనియాడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు మెంటార్ గా వ్యవహరించిన గంగూలీ గురించి స్పందిస్తూ.. దాదా ఎంతో సాయం చేశాడని, జట్టులో యువకులను ఎంతో ప్రేరిపించేవాడని అన్నాడు. ఫేవరేట్‌ ఓపెనింగ్‌ భాగస్వామి ఎవరని ప్రశ్నించగా శిఖర్‌ ధావన్‌ అని సమాధానమిచ్చాడు. క్రికెట్ తో పాటు గోల్ఫ్‌, టేబుల్ టెన్నిస్‌, స్విమ్మింగ్‌ ఇష్టమని తెలిపాడు. టీమిండియా తరఫున పృథ్వీ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. బహిస్కృత డ్రగ్ ‘టర్బులిన్’ వాడటంతో అతడు 8 నెలల సస్పెన్షన్‌ ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles