Lasith Malinga confirms ODI retirement వన్డేలకు గుడ్ బై చెప్పనున్న శ్రీలంక పేసర్

Lasith malinga to retire after 1st odi vs bangladesh

world cup, Retirement, Lasith Malinga, Sri Lanka, Malinga retirement, Bangladesh ODI, Dimuth Karunaratne, Sri Lanka news, one-day international, sports, cricket

Sri Lankan ODI captain Dimuth Karunaratne has confirmed that legendary cricketer Lasith Malinga will bid farewell to international cricket after the 1st ODI of the series against Bangladesh at home.

వన్డేలకు గుడ్ బై చెప్పనున్న శ్రీలంక లెజండరీ పేసర్

Posted: 07/23/2019 04:19 PM IST
Lasith malinga to retire after 1st odi vs bangladesh

శ్రీలంక పేసర్ లసిత్ మలింగ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో పార్టనర్ షిఫ్ బ్రేక్ చేయడంలో దిట్టగా పేరొందిన మలింగ తన అభిమానులకు షాకిచ్చేవార్తను అందించాడు. త్వరలో ఆయన వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. బంగ్లాదేశ్‌తో ఈ నెల 26న మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ అనంతరం మలింగ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె తెలిపాడు.

బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో 36 ఏళ్ల మలింగ కూడా ఉన్నాడు. అయితే, సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కిప్పర్ కరుణరత్నె మాట్లాడుతూ.. మలింగ తొలి వన్డే మాత్రమే ఆడతాడని ప్రకటించాడు. మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిపాడు. సెలక్టర్లకు అతడు ఏం చెప్పాడో తనకు తెలియదని, కానీ తనకు మాత్రం రిటైర్మెంట్ గురించి చెప్పాడని వివరించాడు.

17 జూలై 2004న అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మలింగ 225 వన్డేల్లో 335 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. అతడికంటే ముందు దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (523), చామిందా వాస్ (399) ఉన్నారు. ప్రపంచకప్‌లో మాత్రం అత్యధిక వికెట్లు తీసిన రికార్డు మలింగ పేరుపైనే ఉంది. మొత్తం 7 ఇన్నింగ్స్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. కాగా, మలింగ 2011లోనే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lasith Malinga  Sri Lanka  retirement  Bangladesh ODI  one-day international  cricket  

Other Articles