ICC announces first ever female match referee తొలి మహిళా రిఫరీగా ఇండియన్ మాజీ వుమెన్ క్రికెటర్

India s gs lakshmi becomes first female icc match referee

GS Lakshmi, first female ICC referee, ICC match referee, GS Lakshmi, ICC,female ICC match referee, eloise sheridan, claire polosak, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

GS Lakshmi has become the first female match referee after the International Cricket Council (ICC) named the 51-year-old in its list of elite match officials

తొలి మహిళా రిఫరీగా ఇండియన్ మాజీ వుమెన్ క్రికెటర్

Posted: 05/14/2019 10:23 PM IST
India s gs lakshmi becomes first female icc match referee

ఐసీసీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.  భారతీయ మాజీ మహిళా క్రికెటర్ జీఎస్ లక్ష్మి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఐసీసీ ఇంటర్నేషనల్ మ్యాచ్ రెఫరీల ప్యానల్ లో చోటు సంపాదించారు. ఈ ప్యానల్ లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా ఘనతను సాధించారు. 1968లో రాజమండ్రిలో ఆమె జన్మించారు. 2008-09 మధ్య కాలంలో దేశీయ మహిళా క్రికెట్లో 51 ఏళ్ల లక్ష్మి రెఫరీగా వ్యవహరించారు. మూడు మహిళా వన్డే మ్యాచ్ లకు, పలు టీ20లకు ఆమె ఐసీసీ అధికారిణిగా సేవలందించారు.

ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్‌ పొల్సాక్‌ ఏప్రిల్‌ 27న పురుషుల క్రికెట్‌ మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేసిన తొలి మహిళ అంపైర్ గా ఘనత సొంతం చేసుకుంది. వెంటనే జీఎస్‌ లక్ష్మీని రిఫరీని ఎంపిక చేయడం గమనార్హం. ఐసీసీలోని అంతర్జాతీయ ప్యానెల్‌కు తనను ఎంపిక చేయడం లక్ష్మీ  ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ ప్యానల్ లో చోటు దక్కించుకోవడాన్ని తాను అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇండియన్ క్రికెటర్ గా, దేశీయ మ్యాచ్ రెఫరీగా తనకు ఎంతో అనుభవం ఉందని తెలిపారు. ఈ అనుభవాన్ని అంతర్జాతీయ వేదికపై ఉపయోగించుకుంటానని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఐసీసీ, బీసీసీఐలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles