Virat Kohli and AB de Villiers share heartfelt message మీ ప్రోత్సాహం ఇలాగే వుంటే భవిష్యత్తులో బాగా రాణిస్తాం..

Virat kohli ab de villiers thank incredible rcb fans in heartfelt video

Virat Kohli, de Villiers, rcb, royal challengers bangalore, RCB Fans, IPL 2019, IPL 12,, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Virat Kohli and AB de Villiers recorded a special message for all Royal Challengers Bangalore fans and promised to turn things around in the next season of the Indian Premier League.

మీ ప్రోత్సాహం ఇలాగే వుంటే భవిష్యత్తులో బాగా రాణిస్తాం..

Posted: 05/04/2019 09:33 PM IST
Virat kohli ab de villiers thank incredible rcb fans in heartfelt video

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అంటే ఐపీఎల్ టోర్నీలో హాట్ ఫేవరేట్ జట్టు. కానీ అనూహ్యంగా ఈ సారి ఐపీఎల్ లోనే చివరిస్థానంలోకి జారుకుంది. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఈ జట్టులోని స్టార్ బ్యాట్స్‌మెన్ డివిలియర్స్, జట్టు కెప్టెన్ కోహ్లీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పర్సనల్ మెసేజ్ షేర్ చేసుకున్నారు. తాము శాయశక్తులా ప్రయత్నించినా ఈ సారి ప్లే అఫ్ కు వెళ్లలేకపోయామని.. అందుకు చింతిస్తున్నట్లు చెప్పారు.

ఈ సీజన్లో రాణించలేక పోయమాని ఒప్పుకుంటూ మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరం బాగా రాణిస్తామని నమ్మకాన్ని వ్యక్తపరిచారు. 2019సీజన్లో ఆర్సీబీ ఆడనున్న చివరి మ్యాచ్‌కు బెంగళూరు వేదికగా జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్లేయర్లు డివిలియర్స్, విరాట్ కోహ్లీ ఓ ప్రత్యేకమైన మెసేజ్‌ను పంపారు. వర్షంలో ఆగిపోయిన మ్యాచ్ గురించి డివిలియర్స్ మాట్లాడుతూ.. చివరి ఓవర్ అంటే చివరి 5ఓవర్లతో సమానం. ఆ గేమ్ ఫలితం తేలకపోయినప్పటికీ నాకు జీవితాంతం గుర్తుంటుంది' అని వెల్లడించాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..సీజన్లో ఇంకా మిగిలి ఉంది ఒక మ్యాచ్ మాత్రమే. మేం చేయగలిగినంత చేశాం. చాలా బాధగా ఉంది. సీజన్లో జట్టు ప్రదర్శన మీతో పాటు మమ్మల్ని కూడా నిరాశపరిచింది. వర్షం వచ్చిన్పపటికీ స్టేడియంలో మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. మీ అందరికీ కృతజ్ఞతలు' అని కోహ్లీ తెలిపాడు. డివిలియర్స్ మరోసారి కలగజేసుకుంటూ.. 'ఇలాగే మీ ప్రోత్సాహం అందిస్తూ ఉండండి. వచ్చే సీజన్లో రాణించేందుకు ప్రయత్నిస్తాం' అని వివరించాడు. బెంగళూరు పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించకపోవడంతో శనివారం తన ఆఖరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  de Villiers  rcb  royal challengers bangalore  IPL 2019  IPL 12  sports  cricket  

Other Articles