Dhawan is 2nd fastest Indian to 5000 ODI runs అరుదైన ఘనతను అందుకున్న శిఖర్ ధావన్.!

Shikhar dhawan becomes 2nd fastest indian to reach 5000 odi runs

Shikhar Dhawan, India vs New Zealand, Napier, 5000 ODI runs, Virat Kohli, Mohammed Shami, Kuldeep Yadav, Sun stoppage, sports news, sports, latest sports news, cricket news, cricket

On an eventful first ODI match against New Zealand at Napier on Wednesday, opener Shikhar Dhawan became the second fastest Indian to reach 5000 runs in the fifty-overs format.

అరుదైన ఘనతను అందుకున్న శిఖర్ ధావన్.!

Posted: 01/23/2019 08:21 PM IST
Shikhar dhawan becomes 2nd fastest indian to reach 5000 odi runs

టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్ వన్డే కెరీర్‌ మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు. దీంతో దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాడు. అతి తక్కువ వన్డే ఇన్నింగ్స్‌ల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న టీమిండియా రెండో క్రికెటర్‌గా నిలిచాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆది నుంచి దూకుడుగా ఆడిన గబ్బర్‌ తన కెరీర్‌ కీలక‌ మైలురాయిని చేరుకోవడం విశేషం.

అతి కొద్ది ఇన్నింగ్స్‌లో ఐదు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న వారిలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్‌ ఆమ్లా(101 ఇన్నింగ్స్‌) తొలి స్థానంలో ఉన్నాడు. తర్వాతి ఈ ఘనతను 114 ఇన్నింగ్స్‌లోనే విండీస్‌ లెజెండరీ క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ సాధించారు. ఇక  శిఖర్‌ ధావన్‌ కూడా 118 ఇన్నింగ్స్‌లో ఐదు వేల పరుగులు మైలు రాయిని చేరుకున్నాడు.

దీంతో క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా రికార్డును ధావన్‌ సమం చేశాడు. ధావన్‌ తర్వాతి స్థానంలో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌సన్‌(119 ఇన్నింగ్స్‌), విండీస్‌ మాజీ  గ్రీనిడ్జ్‌(121 ఇన్నింగ్స్‌), దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌(124 ఇన్నింగ్స్‌) ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shikhar Dhawan  India vs New Zealand  Napier  5000 ODI runs  Virat Kohli  Cricket  

Other Articles