Akash soars sky-high with a perfect ten! అకాశ్ చౌదరి మహాద్భుత విన్యాసం..

Rajasthan boy claims 10 wickets without conceding a run in t20 match

Cricket, Aakash Chaudhary, Rajashthan fast bowler, Rajasthan pacer 10 wickets, 10 wickets T20 game, 10 wickets in innings, Late Bhawer T20 tournament, Rajasthan T20 bowler, Aakash Chaudhary 10 wickets, sports news,sports, latest sports news, cricket news, cricket

A 15 year old rajasthan boy Akash Chaudhary, a rookie left-arm medium-pacer, who bowled four overs all of them maidens and grabbed all 10 wickets, has shot to fame in a local T20 match.

అకాశ్ చౌదరి మహాద్భుత విన్యాసం..

Posted: 11/09/2017 05:14 PM IST
Rajasthan boy claims 10 wickets without conceding a run in t20 match

రాజస్థాన్ కు చెందిన 15ఏళ్ల క్రికెటర్‌ అరుదైన రికార్డు సాధించాడు. తన బౌలింగ్లో ఒక్క పరుగు కూడా ప్రత్యర్థుల చేయనీయకుండా కట్టడి చేయడంతో పాటు ఏకంగా ప్రత్యర్థి జట్టు అటగాళ్లందరి విక్కట్లను తీసి తన ఖాతాలో వేసుకుని మరో రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు ఇదే మ్యాచ్ లో హ్యాట్రిక్ కూడా సాధించాడు. ఇన్ని చేసిందే ఒక్కే ఒక్కడు అకాష్ చౌదరి. అకాష్ చౌదరి అద్బుత విన్యాసంతో భావర్‌ సింగ్‌ టీ20 టోర్నమెంట్లో ఇది చోటు చేసుకుంది.

టోర్నీలో భాగంగా దిషా క్రికెట్ అకాడమీ- పర్ల్ అకాడమీ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పర్ల్‌ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన దిషా క్రికెట్ అకాడమీ జట్టు నిర్ణీత ఓవర్లలో 156 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పర్ల్ జట్టు స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. అందుకు కారణం దిషా జట్టుకు చెందిన బౌలర్ అకాశ్ చౌదరి.  ఒక్క పరుగు ఇవ్వకుండా హ్యాట్రిక్ తో పాటుగా పది వికెట్లను తన ఖాతాలో వేసుకుని ప్రత్యర్థి జట్టును ఖంగుతినిపించాడు.

కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేసే టీ20 ఈ విధంగా పది విక్కెట్లు సాధించడం చాలా సంతోషంగా వుందని, అయితే దీనిని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అకాశ్ చౌదరి అన్నాడు. టీ20లో ఐదు వికెట్లు తీయడమే గొప్ప.. అలాంటి పది వికెట్లు.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా.. ఇది అదృష్టమేనని అన్నాడు. తాను టీమిండియా స్పీడస్టర్ జహీర్ ఖాన్ అభిమానినని చెప్పిన అకాశ్.. అతని బౌలింగ్ శైలి తనకెంతో ఇష్టమన్నాడు. ప్రస్తుతం అండర్‌-16 ఛాలెంజర్ ట్రోఫీకి సన్నద్ధమవుతున్నానని, అందులో తనకు స్థానం దక్కితే తన బౌలింగ్ అద్భుతాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశముందన్నాడు. ఆకాశ్‌ ఈ టోర్నీలో అవకాశం దక్కాలని అశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles