ఫైవ్ స్టార్ హోటళ్లో ధోని స్మార్ట్ ఫోన్లు చోరి MS Dhoni files complaint over stolen mobile phones

Ms dhoni files complaint over stolen mobile phones

MS Dhoni, Delhi Police, MS Dhoni fire scare, Vijay Hazare Trophy, Jharkhand state cricket team, mobile phones stolen, Delhi Police, BCCI, cricket

MS Dhoni lodged a complaint with Delhi Police regarding the theft of his cell phones during a fire scare in Dwarka's Welcome Hotel on Friday.

ఫైవ్ స్టార్ హోటళ్లో ధోని స్మార్ట్ ఫోన్లు చోరి

Posted: 03/19/2017 04:28 PM IST
Ms dhoni files complaint over stolen mobile phones

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి మరో చేదు అనుభవం ఎదురైంది. ‘మిస్టర్ కూల్’ మూడు సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. ద్వారకలోని ‘వెల్‌కమ్‌’ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తన మూడు ఫోన్లను ఎవరో దొంగిలించారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.  ఇందులో ఒక ఐ ఫోన్తో పాటు మరో రెండు విలువైన ఫోన్లు ఉన్నట్లు నగర పోలీసులకు ధోని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దోని పిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లోపే కేసును చేధించారు.

హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో ధోని తన ఫోన్లను అక్కడే వదిలేసి వచ్చేశాడు. ఆ తరువాత వాటికి కోసం వెళ్లగా అవి అక్కడ లేకపోవడంతో తస్కరించిన భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించిన తరువాత ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో ఆ ఫోన్లను తానే దొంగిలించినట్లు సదరు ఆఫీసర్ ఒప్పుకున్నాడు. దొంగిలించ బడ్డ ఒక ఫోన్లో భారత క్రికెట్ జట్టుకు, బీసీసీఐకి సంబంధించిన  అత్యంత విలువైన సమాచారం ఉండటంతో ధోని దాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : MS Dhoni  mobile phones stolen  Delhi Police  BCCI  cricket  

Other Articles

Today on Telugu Wishesh