కంగారులతో తొలి రెండు టెస్టులకు అదే జట్టు..అ India unchanged for first two Australia Tests

India announce squad for first two tests vs australia

india vs australia 2017, india vs australia test 2017, india vs australia test, india test squad, india test squad vs australia, virat kohli, kohli, cricket news, cricket, sports news, cricket

India retain most of the players from the squad for one-off Test against Bangladesh for four-match Australia series.

కంగారులతో తొలి రెండు టెస్టులకు అదే జట్టు..

Posted: 02/14/2017 08:42 PM IST
India announce squad for first two tests vs australia

స్వదేశంలో జరుగుతున్న సిరీస్ లలో వరుస విజయాలను అందుకున్న టీమిండియా.. అదే జోరును జోష్ ను కనబర్చేలా.. అదే జట్టును కంగారులపైకి కూడా ప్రయోగించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అసీస్ తోనూ విజయాన్ని నమోదు చేసేలా.. జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్టర్లు ఇవాళ ప్రకటించారు.

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు కరుణ్ నాయర్ ను తిరిగి జట్టులో్కి ఎంపిక చేయగా, కుల్ దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్ లకు చోటు కల్పించారు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన చివరి టెస్టు లో ట్రిపుల్ సెంచరీతో ఆకట్టుకున్న కరుణ్ నాయర్ పై నమ్మకం ఉంచిన సెలక్టర్లు అతని ఎంపికపై మరోసారి మొగ్గు చూపారు. బంగ్లాదేశ్ తో టెస్టుకు నాయర్ ను ఎంపిక చేయకపోయినా, ఆస్ట్రేలియాతో కీలక సిరీస్ లో నాయర్ కు చోటు కల్పించారు.

ఇదిలా ఉంచితే బంగ్లాదేశ్ తో టెస్టుకు కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్ లను ఎంపిక చేసినా, తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఐదున్నరేళ్ల క్రితం భారత్‌ తరఫున తన చివరి టెస్టు ఆడిన తమిళనాడు బ్యాట్స్‌మన్‌ ముకుంద్‌కు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు లభించింది. మరొకవైపు కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఆడే అవకాశం రాని కుల్దీప్.. ఆస్ట్రేలియాతో సిరీస్ లో అతను అరంగేట్రం చేసే అవకాశాలు కనబడతున్నాయి.ఈ నెల 23వ తేదీన ఆస్ట్రేలియాతో పుణెలో జరిగే తొలి టెస్టుతో నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.

తొలి రెండు టెస్టులకు భారత జట్టు:

విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర పూజారా, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  team india  bangladesh tour  virat kohli  sports news  cricket  

Other Articles