తొలిరోజు అతిధ్యజట్టు పైచేయి కనబర్చిన ఇంగ్లాండ్ Jennings' debut century gives England edge

England 288 5 at stumps on day 1 of 4th test

england, team india, wankhede test, ravichandran ashwin, ravindra jadeja, cricket score, india vs england score, ind vs eng, ind vs eng, india vs england, india vs england 4th test, cricket score, cricket

India managed to crawl back into the fourth Test against England in Mumbai, thanks to a four-wicket haul from R Ashwin that put England on the back-foot.

తొలిరోజు అతిధ్యజట్టు పైచేయి కనబర్చిన ఇంగ్లాండ్

Posted: 12/08/2016 06:59 PM IST
England 288 5 at stumps on day 1 of 4th test

ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో వేదికగా జరుగుతున్న నాల్గో టెస్టు తొలి రోజు టీమిండియాపై అతిధ్య జట్టు పైచేయిని కనబర్చింది. తొలి రోజు అటముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 288 పరుగులు సాధించింది. భారత్ ఇద్దరు అల్ రౌండర్లు మాత్రమే పర్యాటక జట్లు ఐదు వికెట్లను సాధించారు. అయితే ఫుల్ టైం బైలర్లు మాత్రం అంతగా ప్రతిభ కనబర్చలేకపోయారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో ఈ మ్యాచ్ తోనే అరంగ్రేటం చేసి కీనట్ జెన్నింగ్స్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. తొలుత సున్నా పరుగుల సమయంలో అయన ఇచ్చిన క్యాచ్ ను భారత అటగాళ్లు మిస్ చేయడంతో నిలదోక్కుకున్న జెన్నింగ్స్ (112;219 బంతుల్లో 13 ఫోర్లు) శతకం సాధించాడు. అటు ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్(46) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఈ జోడి తొలి వికెట్ కు 99 పరుగులు జోడించిన తరువాత కుక్ పెవిలియన్ చేరాడు.

రవీంద్ర జడేజా బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయిన కుక్ను పార్థీవ్ పటేల్ స్టంప్ చేసి వెనక్కు పంపాడంతో బోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ కోల్పోయింది. కాగా, ఆ తరువాత వచ్చిన జో రూట్ ను కూడా స్వల్ప స్కోరుకే అశ్విన్ వెనక్కు పంపాడు. ఆ తరుణంలో వచ్చిన మొయిన్ అలీ.. జెన్నింగ్స్ తో కలసి మూడో వికెట్ కు 94 పరుగులు భాగస్వామ్యాని సాధించి స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది.

కాగా, జట్టు స్కోరు 230 పరుగుల వద్ద ఉండగా అలీ మూడో వికెట్ గా అశ్విన్ బౌలింగ్ లో పెవీలియన్ చేరాడు. ఆ తరువాత శతకం సాధించిన జెన్నింగ్స్ను కూడా అశ్విన్ కు చిక్కి వెనక్కు వెళ్లాడు. మరో 19 పరుగుల వ్యవధిలో బెయిర్ స్టో(14)కూడా అశ్విన్ కు చిక్కడంతో భారత్ పట్టు సాధించినట్లు కనబడింది. అయితే ఆ తరువాత బెన్ స్టోక్స్(25 బ్యాటింగ్), బట్లర్(18 బ్యాటింగ్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో మళ్లీ ఇంగ్లండ్దే పైచేయి సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  england  team india  wankhede test  cricket  

Other Articles