India aim to retain second spot in rankings in historic series against West Indies

India will slip in icc t20 rankings if it loses 0 2

India vs West Indies, India vs West Indies T20 in Florida, MS Dhoni, team india, seecond rank in t20, Virat Kohli, West Indies-India, Samuel Badree, KL Rahul, Team India in USA,

India will square off against West Indies for the first time in the United States of America. The two teams play two T20 Internationals over the weekend.

నెంబర్ టు స్థానాన్ని టీమిండియా నిలబెట్టుకునేనా..?

Posted: 08/28/2016 12:07 AM IST
India will slip in icc t20 rankings if it loses 0 2

అంతర్జాతీయ టీ 20 క్రికెట్ ర్యాంకింగ్స్లో రెండో ర్యాంకులో కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా.. ఆ ర్యాంకును మరికొంతకాలం కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇరు జట్ల మధ్య శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో ధోని అండ్ గ్యాంగ్ విజయం సాధిస్తే  రెండో ర్యాంకును పదిలంగా ఉంచుకుంటుంది.  ఒకవేళ   ఈ సిరీస్ను విండీస్ క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం భారత్ మూడో ర్యాంకు పడిపోతుంది.  అప్పుడు విండీస్ రెండో స్థానానికి చేరుతుంది.

దాదాపు ఐదు నెలల క్రితం జరిగిన టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో విండీస్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత్ ఘనమైన ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ రెండు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించిన పక్షంలో 132 రేటింగ్ పాయింట్లతో ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరువగా వస్తుంది.  ప్రస్తుతం న్యూజిలాండ్ 132 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ దశగణ సంఖ్య  ప్రకారం భారత్ రెండో ర్యాంకుకే పరిమితం అవుతుంది.  అదే క్రమంలో సిరీస్ డ్రాగా ముగిస్తే మాత్రం ఇరు జట్ల ర్యాంకింగ్స్లో మార్పు ఉండదు.  ఇక ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లి తన అగ్రస్థానాన్ని నిలుపుకోవాలంటే మెరుగ్గా రాణించాల్సి ఉంది. విరాట్ తరువాత ఆస్ట్రేలియా ఆటగాడు అరోన్ ఫించ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ ఇద్దరి ఆటగాళ్ల మధ్య రాంకింగ్స్ విషయంలో 34 పాయింట్లు మాత్రమే తేడా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  T20 matches  T20 Rankings  world champions  India  Weat indies  cricket  

Other Articles