Wasim Akram turns 50, says 'wife told me 50 is new 40'

Wasim akram says life exemplary at age of 50

wasim akram, akram, wasim, wasim akram birthday, wasim akram 50th birthday, wasim akram pakistan, akram pakistan, pak wasim akram, cricket

Wasim Akram celebrated his 50th birthday with family and friends and said cricket has brought him great fame.

జన్మదినం రోజున ఉబ్బితబ్బివతున్న వసీం అక్రమ్

Posted: 06/04/2016 05:54 PM IST
Wasim akram says life exemplary at age of 50

పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ ఇవాళ యాభైవ పడిలో అడుగుపెట్టారు, తన యాభైవ పుట్టినరోజు వేడుకల్ని భార్యతో కలిసి జరుపుకున్నాడు. అయితే తన భార్య మాత్రం తనకు ఈ పుట్టిన రోజున ఇచ్చే సాధారణ బహుమతులతో పాటు మరో గిఫ్ట్ ఇచ్చారట, దాంతో వసీమ్ అక్రమ్ ఉబ్బి తబ్బివవుతున్నాడు. సాధారణ కుర్రాడి స్థాయి నుంచి అంతర్జాతీయంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న తన జీవితం ఇప్పటివరకూ ఆదర్శప్రాయంగానే సాగిందని ఈ సందర్భంగా వసీం అక్రమ్ తెలిపాడు.

ఈ యాభై ఏళ్ల తన జీవితం ఖచ్చితంగా అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అయితే 'నీవు కొత్తగా 40 ఒడిలో అడుగుపెట్టినట్లు ఉన్నావంటూ'   భార్య  షనీరా థాంప్సన్‌ అభినందనతో  తాను ఎక్కువ ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నాడు.ఈ పుట్టిన రోజు వేడుకలు నా జీవితంలో మరింత కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. నా జీవితం ఇప్పటివరకూ ఆదర్శవంతంగానే నిలిచింది. నాకు  40 ఏళ్లే నంటూ భార్య ఇచ్చిన అభినందనతో ఎక్కువ ఎంజాయ్ చేశా' అని అక్రమ్ తెలిపాడు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్థి జట్లను గడగడలాడించిన అక్రమ్కు చాలానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు పాకిస్తాన్తో పాటు భారత్లోనూ అక్రమ్కు విశేష సంఖ్యలో అభిమానులున్నారు. వసీం అక్రమ్ 104 టెస్టులాడి 414 వికెట్లు తీయగా, 356 వన్డేల్లో 502 వికెట్లు సాధించాడు. అతను సాధించిన ఈ రెండు ఘనతలు పాకిస్తాన్ క్రికెట్లో ఇప్పటికీ పదిలంగా ఉండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  cricket  pak bowling legend  wasim akram  birthday  birthday compliment  

Other Articles