Bombay High Court questions hosting IPL matches in drought-hit state

Bombay high court questions hosting ipl matches in drought hit state

Bombay, High Court, IPL, IPL2016

The Bombay High Court has sought an explanation from the BCCI and the three state associations in Maharashtra on why water should be "wasted" on hosting IPL 2016 matches when the state is facing one of its worst-ever droughts. After making a series of stinging remarks questioning the BCCI's priorities, the board's counsel sought time to prepare a contingency plan and the case was adjourned till April 7.

ముంబైలోనే ఐపీఎల్ మొదటి మ్యాచ్..అంతా సిద్దం

Posted: 04/08/2016 12:43 PM IST
Bombay high court questions hosting ipl matches in drought hit state

ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ పై అడ్డంకులు తొలగినట్లే. ముంబైలో ఐపీఎల్ ప్రారంభపు మ్యాచ్ సజావుగా సాగుతుంది. ఫస్ట్ మ్యాచ్ పై ఎలాంటి స్టే ఇవ్వడం లేదని బాంబే హైకోర్టు ప్రకటించింది. మహారాష్ట్రలో నీటి సంక్షోభం, ఐపీఎల్ కు నీరు వృథా చేస్తున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్ – ప్రజాప్రయోజన వ్యాజ్యం- ను విచారిస్తున్న బాంబే హైకోర్టు ఈ వివరణ ఇచ్చింది. పిల్ ను విచారణకు చేపట్టిన సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు, మ్యాచ్ లను తరలించాలన్న సూచన నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన ఐపీఎల్ ప్రారంభపు మ్యాచ్ పై సందిగ్థం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9న ఐపీఎల్ ప్రారంభపు మ్యాచ్ సజావుగా సాగుతుందని బాంబే హైకోర్టు ప్రకటించింది.

మహారాష్ట్ర ప్రభుత్వం పై మొట్టికాయలు వేసిన హైకోర్టు ఐపీఎల్ నిర్వాహకులకు ప్లే గ్రౌండ్ నిర్వహణకు అవసరమైన నీరు కల్పించాల్సిందిగా కూడా సూచించింది. మహారాష్ట్రలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. 70 శాతం ప్రాంతాలు కరవుతో మగ్గుతున్నాయి. మహారాష్ట్రలో మూడు నగరాల్లో అంటే ముంబై, పుణే, నాగపూర్ లో మొత్తం 20 ఐపీఎల్ టీ-20 మ్యాచ్ లు జరగాల్సి ది. ఏప్రిల్ 9న వాంఖడే స్టేడియంలో తొలిమ్యాచ్ జరగాల్సి ఉంది. ఐపీఎల్ షెడ్యూల్ ఎప్పుడో ప్రకటించినా.. మ్యాచ్ ల ప్రారంభానికి ఇక కేవలం 4 రోజులు ఉందనగా పిల్ దాఖలు చేయడంతో ఔన్యత్యాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రశ్నించింది. స్టేడియం నిర్వహణకు తాగడానికి పనికిరాని నీటిని తాము కొనుక్కుంటున్నామని ఎంసీఏ వెల్లడించింది. కాగా, ఈ నీరు పనికిరానిదా అన్న అంశాన్ని దర్యాప్తు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవలం 22 వేల లీటర్లు స్టేడియానికి సరఫరా అయితే సరిపోతుందా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bombay  High Court  IPL  IPL2016  

Other Articles