Manish Pandey Comes in For Injured Yuvraj Singh For World T20 Semis vs West Indies

Manish pandey called up as stand by for injured yuvraj singh

Icc World T20. Virat Kohli, Australia, Yuvraj Singh, manish pandey, semi finals, west indies, Mahendra Singh Dhoni, indvsaus, india vs australia, ind vs aus, australia vs india, aus vs ind, virat kohli, kohli, sunil gavaskar, gavaskar, india virat kohli, kohli, wt20, icc world t20, cricket

Manish Pandey made a century in his last appearance,against Australia is play for injured Yuvraj Singh in the World T20 semifinal versus West Indies

అనుకున్నట్లే జరిగింది.. యవరాజ్ ఔట్.. మనీష్ పాండే ఇన్

Posted: 03/30/2016 08:59 PM IST
Manish pandey called up as stand by for injured yuvraj singh

వరల్డ్ టీ 20లో తన భాగస్వాములతో కలసి చక్కగా రాణిస్తున్న టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ఇకపై జరిగే సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచుల ఆడటం లేదు.  చీలమండ గాయంతో తీవ్రంగా బాధపడుతోన్న యువరాజ్ సింగ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గురువారం ముంబైలో వెస్టిండీస్ తో జరగనున్న సెమీఫైనల్స్ మ్యాచ్ కోసం యువరాజ్ స్థానంలో మనీశ్ పాండేను జట్టులోకి తీసుకుంటున్నట్లు సెలెక్టర్లు నిర్ధారించారు. నిజానికి యువరాజ్ గాయపడ్డప్పుడే మనీశ్ జట్టులోకి వస్తాడని ఊహించినప్పటికీ బుధవారం సెలెక్టర్ల ప్రకటనతో అది ఖరారయింది.

సెమీస్ లోకి ప్రవేశించేందుకు గత ఆదివారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగన అమీతుమీ మ్యాచ్ లో పరుగులు తీస్తూ ఒక్కసారిగా కూలబడ్డ యువరాజ్ ఆ తర్వాత నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. తొలి, మలి టీ20 వరల్డ్ కప్ ల్లో సత్తా చాటినంతగా యువరాజ్ ఈసారి ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు ఆడిన అతను.. కేవలం 63 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. పాకిస్థాన్ పై సాధించిన 24 పరుగులే అత్యధిక స్కోరు. మూడు మ్యాచ్ ల్లో బౌలింగ్ చేసే అవకాశం రాని యువరాజ్ ఆసీస్ తో జరిగి మ్యాచ్ లో మాత్రం మూడు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Icc world cup T20-2016  yuvraj singh  manish pandey  semi finals  west indies  

Other Articles