After impressive India debut, Barinder Sran wants to bowl effective 'slower bouncers'

David warner s wicket got me pumped says barinder sran

Barinder Sran, India's tour of Australia, India vs Australia, Australia vs India 2016, Indian Cricket, Australian Cricket, David Warner, WACA Ground, Perth, Steven Smith, George Bailey, Zaheer Khan, cricket news

After making an impressive India debut, albeit in a losing cause, young pace bowler Barinder Sran has assured that he will work hard and learn new tricks, including slow bouncers.

వాళ్లందరికీ ధన్యవాదాలు.. మరిన్నీ మెళకువలతో రాణిస్తా..

Posted: 01/14/2016 05:19 PM IST
David warner s wicket got me pumped says barinder sran

తన చిరకాల స్వప్నం, ఆశ, ఆశయం అన్ని ఒక్కటేనని అది సాకారం కావడానికి తొడ్పాటును అందించిన అందరికీ.. హర్యానా యువ సంచలనం, టీమిండియా పేస్ బౌలర్ బరీందర్ శరణ్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఆశయసిద్దిలో తనకు మద్ధతు తెలిపిన వారందరికీ  తాను విజయాన్ని సాధించాలని ఆకాంక్షించిన అందరికీ, తనను ప్రేమించిన వారికి కృతజ్ఞతలు అంటూ బుధవారం ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. టీమిండియా క్యాప్ ధరించాలనుకున్న తన కల నెరవేరిందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్తో టీమిండియా తరఫున యువ పేస్ బౌలర్ వన్డేల్లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే.

వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 207వ ఆటగాడిగా అతని పేరు నమోదైంది. తొలి వన్డేలో భారత్ ఓడినా... తమ కుర్రాడు మాత్రం నిరాశపర్చలేదని ఈ క్రికెటర్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పెర్త్ వాకా స్టేడియం బ్యాటింగ్కు అనుకూలించినా బరిందర్ తన తొలి వన్డే మ్యాచ్లోనే సత్తాచాటుతూ మూడు వికెట్లు పడగొట్టాడు. బరిందర్ పేస్ బౌలింగ్ బాగుందని, అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆసీస్ టీ20 కెప్టెన్ బెయిలీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles