McGrath, Murali toughest I have faced: Dravid

Rahul dravid reveals the two bowlers that troubled the wall

Rahul Dravid, Murali Vijay, Glenn McGrath, australia, Muttiah Muralitharan, Ajinkya Rahane, Anil Kumble, Ravichandran Ashwin, Cricket, Facebook interaction, India, Australia, Sri Lanka

Rahul Dravid picked Glenn McGrath and Muttiah Muralitharan as the toughest bowlers he has faced during his illustrious career in international cricket.

వాళ్లిద్దరే నన్ను భయపెట్టారు.. వాల్

Posted: 12/02/2015 06:05 PM IST
Rahul dravid reveals the two bowlers that troubled the wall

‘వాల్’గా పేరుగాంచిన మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ ద్రావిడ్ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఇద్దరంటే ఇద్దరు బౌలర్లకు మాత్రమే భయపడ్డాడట. వన్డే మ్యాచ్ అయినా, టెస్టు మ్యాచ్ అయినా... రాహుల్ ద్రావిడ్ ను క్రీజులో నుంచి పెవిలియన్ చేర్చడమంటే బౌలర్లకు చికాకెత్తేది. ఓ పట్టాన అతడు ఔటయ్యే వాడు కాదు. ఇలా గంటల తరబడి క్రీజులో నిలదొక్కుకున్న ద్రావిడ్ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

తన సుదీర్ఘ కెరీర్ లో అన్ని దేశాల బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నానని, అయితే ఇద్దరు బౌలర్లు మాత్రం తనను ఇబ్బంది పెట్టారని ద్రావిడ్ ఫేస్ బుక్ లో తన అభిమానులకు చెప్పాడు. వీరిలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ ఒకరని అతడు చెప్పాడు. మెక్ గ్రాత్ ఆఫ్ స్టంప్ లపైకి విసిరే బంతులను అంచనా వేయడంలో చాలా ఇబ్బంది పడ్డానని కూడా అతడు పేర్కొన్నాడు. ఇక శ్రీలంకకు చెందిన స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ అన్నా భయపడేవాడినని ద్రావిడ్ చెప్పాడు. మురళీధరన్ చేసే బౌలింగ్ బిగుతుగా ఉండేదని ద్రావిడ్ వ్యాఖ్యానించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia  glenn mcgrath  india  muttiah muralitharan  rahul dravid  sri lanka  

Other Articles