India vs South Africa, 1st Test Day 1: South Africa end Day 1 at 28/2

No pitch worries for india south africa

cricket score, live score, score live, ind vs sa, ind vs sa live, ind vs sa score, india vs south africa live score, live score india vs south africa, india south africa 1st test, ind vs sa 1st test live, 1st test live score, live latest score, india, india vs south africa 2015, india vs south africa livescore, mohali, r ashwin, south africa, virat kohli latest score, cricket news

India struck early after posting a disappointing total at Mohali. Spinners Ravi Ashwin and Ravindra Jadeja removed South Africa’s Van Zyl and Faf Du Plessis with two beautiful deliveries.

మొహాలీ టెస్టు: తొలిరోజు సత్తా చాటిన బౌలర్లు.. 12 వికెట్లు

Posted: 11/05/2015 07:00 PM IST
No pitch worries for india south africa

టీమిండియాతో టీ20, వన్డే సిరస్ లను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా అదే దూకుడుతో ముందుకు సాగుతూ.. మొహాలీ వేడుకగా ఇవాళ ప్రారంభమైన టెస్టు సిరీస్ తొలి వన్డేలోనూ జోరు కొనసాగించింది. మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మొదటి రోజు ఆటలో సఫారీలు పైచేయి సాధించారు. ఆరేళ్ల తరువాత సొంత గడ్డపై టీమిండియాను మట్టికరిపించారు. తొలిరోజే కోహ్లీ సేనను ఆలౌట్ చేసిన జట్టుగా కీర్తి గడించారు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మెన్ ను సఫారీ బౌలర్లు ఏ దశలోనూ కుదురుకోనివ్వలేదు.

స్పిన్ కు అనుకూలంగా వున్న పిచ్ పై నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా పేస్ బౌలర్లు సత్తాచాటరు. టీమిండియా టాపార్డర్ పని పట్టారు. మురళీ విజయ్, రవీంద్ర జడేజా కాస్త ప్రతిఘటించినప్పటికీ ఎదురుదాడికి దిగలేకపోయారు. దీంతో 210 పరుగులకే కోహ్లీ సేన అలౌట్ అయ్యింది. భారత బ్యాట్స్ మన్లలో మురళీ విజయ్ (75), ఛటేశ్వర్ పుజారా (31) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (1), అజింక్యా రహనే (15), వృద్ధిమాన్ సాహా (0), రవీంద్ర జడేజా (38), అమిత్ మిశ్రా (6), రవిచంద్రన్ అశ్విన్ (20), ఉమేష్ యాదవ్ (5), వరుణ్ ఆరోన్ (0)  పరుగులకే వెనుదిరిగారు.

సఫారీ కొత్త బౌలర్ ఎల్గర్ నాలుగు వికెట్లు తీసి సత్తాచాటగా, ఫిలాండర్, తాహిర్ చెరి రెండు వికెట్లతో రాణించారు. వారికి హర్మర్, రబడా చెరో వికెట్ తో సహకరించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో వాన్ జిల్ (5), డుప్లెసిస్ (0) వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. క్రీజులో ఎల్గర్ (13), కెప్టెన్ హషీమ్ ఆమ్లా (9) ఉన్నారు. భారత్ స్కోరు దాటేందుకు సౌతాఫ్రికా 173 పరుగులు చేయాల్సిఉంది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో వికెట్ సాధించారు. రెండవ రోజు పిచ్ స్పిన్ బాగా అనుకూలిస్తుందని భారత క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles