BCCI dials Gary Kirsten's number, asks South African to coach India again

Bcci approaches gary kirsten for second stint as india coach

Board of Control for Cricket in India (BCCI), Duncan Fletcher, kristen honoured to be offered the job again, Kirsten successful coach, kristen help India World Cup, BCCI, Gary Kirsten, South Africa, Indian cricket coach, team india

Former South Africa opener Gary Kirsten could return as India's coach as the Board of Control for Cricket in India (BCCI) have approached him.

టీమిండియా కోచ్‌గా మళ్లీ గ్యారీ కిర్‌స్టన్..?

Posted: 10/16/2015 04:47 PM IST
Bcci approaches gary kirsten for second stint as india coach

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా మరోమారు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఓపెనర్ గ్యారీ కిర్‌స్టన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా..? అంటే అవుననే సంకేతాలే వెలువడుతున్నాయి.  టీమిండియా క్రికెట్ కోచ్‌గా మళ్లీ ఓ పర్యాయం బాధ్యతలు తీసుకొగలరా ..? అంటూ ఆయనను ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఇప్పటికే సంప్రదించింది. ఈ మేరకు ఆయనకు రెండు మూడు పర్యాయాలు ఫోన్ కాల్స్ కూడా చేసిందని తెలుస్తోంది. 2008 నుంచి 2011 వరకు భారత జట్టు కోచ్‌గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టన్.. స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో భారత్ కప్‌ను సొంతం చేసుకునే దిశగా టీమిండియాను నడిపించి విజయవంతమైన కోచ్ గా ఖ్యాతి పొందాడు.

2011 ఏప్రిల్ 2వ తేదీన వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో భారత్ విజయం సాధించిన తర్వాత ఆయన కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు 2013 జులై వరకు కోచ్‌గా వ్యవహరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) డేర్ డెవిల్స్ జట్టుకు 2014, 2015ల్లో ఇంచార్జీగా వ్యవహరించారు. కోచ్‌గా రావాలని తనకు బిసిసిఐ ఫోన్ చేసి అడిగినట్లు ఓ జాతీయ మీడియాకు గ్యారీ కిర్‌స్టన్ చెప్పారు. ఒకటి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయని, అయితే తాను నిర్ణయం తీసుకునే స్థితిలో లేనని చెప్పారు. అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం గౌరవప్రదమైన విషయమని ఆయన అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Gary Kirsten  South Africa  Indian cricket coach  team india  

Other Articles