Cricket icon Sachin Tendulkar has lent his voice to Swachh Bharat anthem | Narendra Modi News | Clean India Campaign

Sachin tendulkar lends voice to swachh bharat anthem with singers

sachin tendulkar news, sachin tendulkar updates, sachin tendulkar swachh, swachh bharat anthem, shankar ehsan loy, clean india campaign, mahatma gandhi birthday, swachh bharat campaign, narendra modi

Sachin Tendulkar lends voice to Swachh Bharat anthem With Singers : Cricket icon Sachin Tendulkar has lent his voice to Swachh Bharat anthem, created under a government initiative to make the "Clean India" campaign a public movement. The anthem, composed by musical trio Shankar-Ehsaan-Loy and sung by Shankar Mahadevan and others, will be released on October 2, marking one year of the launch of Swachh Bharat campaign on Mahatma Gandhi's birth anniversary.

అప్పుడు బ్యాటుతో బాదాడు.. ఇప్పుడు రాగాలు తీశాడు!

Posted: 09/28/2015 06:44 PM IST
Sachin tendulkar lends voice to swachh bharat anthem with singers

ప్రతిఒక్కరిలోనూ తమకు తెలియని కొన్ని ప్రతిభలు దాగి వుంటాయి.. సమయం వచ్చినప్పుడు వాటంతట అవే బయటికి తన్నుకు వస్తాయి.. అవి ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా.. తమకంటూ ప్రత్యేక గుర్తింపునిస్తాయి. అటువంటి అనుభవమే సచిన్ టెండూల్కర్ లో కనిపించింది. క్రికెటర్ గా కొనసాగినప్పుడు మైదానంలో బ్యాటుతో ‘బ్యాండ్ బాజా బారాత్’ సృష్టించిన ఈ లిటిల్ మాస్టర్.. ఇప్పుడు తన గొంతుతో అభిమానుల్ని మాయలో పడేసేందుకు సిద్ధమయ్యాడు. అవును.. సచిన్ టెండూల్కర్ ఇప్పుడు సింగర్ గా అవతారమెత్తాడు. అంతేకాదు.. రచయిత, సంగీత దర్శకుడిగా తన ప్రతిభను చాటుతున్నాడు. క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న ఈయన.. విభిన్న రంగాల్లో తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం వ్యాపార వ్యవహారాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్న సచిన్ టెండూల్కర్ ని ప్రధాని మోదీ ‘స్వచ్ఛభారత్ అంబాసిడర్’గా ఇటీవల ఆహ్వానించిన విషయం తెలిసిందే! ఇందుకోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారు. ఈ పాటలో భాగంగానే బాలీవుడ్ పాటల రచయిత ప్రసూన్ జోషి రచించిన పాటలో సచిన్ గొంతు కలిపాడు. అంతేకాదు.. ఈ పాటలోని కొన్ని పంక్తులను కూడా సచిన్ రచించడం విశేషం. ఇక ఈ పాటను స్వరపరిచింది శంకర్ మహదేవన్, ఎహసాన్, లాయ్ అయితే.. వారికి సహకారం అందిస్తూ సచిన్ స్వరాలు జతపరచడానికి పలు సూచనలు చేశాడు. ఇలా ఈ విధంగా సచిన్ ఒకేసారి రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు అవతారాలను ఎత్తాడు. ముఖేష్ భట్ చిత్రీకరించిన ఈ పాటను గాంధీ జయంత సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  mahatma gandhi  clean india campaign  swachh bharat campaign  

Other Articles