Indian Cool Captain Mahendra Singh Dhoni completes first para jump for territorial army

Mahendra singh dhoni completes first para jump for territorial army

ms dhoni, mahendra singh dhoni, ms dhoni para jump, para jumps, ms dhoni para jump images, ms dhoni latest updates

Mahendra Singh Dhoni completes first para jump for territorial army : Indian Cool Captain Mahendra Singh Dhoni completes first para jump for territorial army

ఎట్టకేలకు ధోనీ ఆకాశంపై నుంచి దూకేశాడు..?

Posted: 08/19/2015 03:32 PM IST
Mahendra singh dhoni completes first para jump for territorial army

టీమిండియా కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో సాహసయాత్రను విజయవంతం చేశాడు. తాను కేవలం క్రికెట్ రంగంలోనే ఓ సక్సెస్ క్రీడాకారుడిననే కాకుండా.. ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలోనూ తనకు తానే సాటినని ధోనీ నిరూపించుకున్నాడు. ఇంతకీ ఆ సాహసోపేతమైన స్టంట్ ఏంటని అనుకుంటున్నారా..? అదేనండి ప్యారాజంప్. ఆ జంప్ చేయడానికి నిజంగానే ఎంతో ధైర్యం వుండాలి. ఎంతో శిక్షణ లేకపోతేగానీ ఎవ్వరూ దానిని చేయలేరు. ప్రాణానికి పణంగా పెట్టి చేయాల్సి వుంటుంది. అటువంటి స్టంట్ ని ధోనీ ఎంతో అలవోకగా విజయవంతం చేశాడు.

ధోనీ కేవలం క్రికెటర్ మాత్రమే కాకుండా ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలోనూ వున్న విషయం విదితమే. ఇందులో భాగంగానే ధోనీ తన తొలి ప్యారాజంప్ ను విజయవంతంగా ముగించారు. ఈ సాహసం చేసేందుకు ధోనీ ఆగస్టు 6 నుంచి ప్యారాట్రూప్స్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు. శిక్షణా నేపథ్యంలో ధోనీ కాస్త తడబడినా.. రంగంలోకి దిగిన తర్వాత ఏమాత్రం బిడియం లేకుండా చాలా కూల్ గా ముగించాడు. ధోనీ చేసిన ఈ సాహసానికి ఆర్మీ అధికారులందరూ ప్రశంసిస్తున్నారు. అటు క్రీడాభిమానుల నుంచి ధోనీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ధోనీ క్రికెటర్ మాత్రమే కాకుండా లెఫ్టినెంట్ కల్నల్ హోదాలోనూ పర్ఫెక్ట్ అని నిరూపించుకున్నాడు.

ఇదిలావుండగా.. టీమిండియా వరుసగా ఓటమి పాలవుతున్న క్రమంలో ధోనీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే! ధోనీలో మునుపటి సత్తా లేదని, అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించాలని ప్రపంచవ్యాప్తంగా కామెంట్స్ వచ్చాయి. దీంతో ధోనీ కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుని, ఇంట్లో పనిని నిర్వహించుకోవడంతోపాటు లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ వస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  indian cricket team  territorial army  

Other Articles