Ten South Africa 'A' players hospitalized due to food poision in chennai | india vs africa match

Ten south africa a players hospitalized due to food poision

south africa cricket team, india cricket team, india vs south africa, india a vs south africa a, india tri series, india latest updates, ten africa players hospitalized

Ten South Africa 'A' players hospitalized due to food poision : Ten South Africa A players have been hospitalised due to "food poisoning", including four today after playing their tri-series cricket match against India A here, the visiting team management said.

ఆసుపత్రిపాలైన 10 మంది సఫారీలు..

Posted: 08/10/2015 11:10 AM IST
Ten south africa a players hospitalized due to food poision

తమ సత్తా చాటుదామని దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన క్రికెటర్లు.. ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు ఫుడ్ పాయిజన్ కారణంగా కుప్పకూలిపోయారు. అది కూడా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదిమంతి ఆటగాళ్లు ఆసుపత్రిపాలయ్యారు. ఈ విధంగా ఆ జట్టు ఆటగాళ్లకు భారీగా దెబ్బ పడటంతో చివరకు టీమిండియా సహాయం తీసుకోక తప్పలేదు. తమ తరఫున ఆడేందుకు ఓ ఆటగాడ్ని సబ్ స్టిట్యూట్ గా తీసుకున్నారు. ప్రస్తుతం 10 మంది ఆటగాళ్లు స్థానిక అపోలో ఆస్పత్రిలో ఉన్నారని దక్షిణాఫ్రికా బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇండియా - దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఈ సిరీస్ లో భాగంగానే దక్షిణాఫ్రికా-ఏ, భారత్-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగానే 10 సఫారీ ఆటగాళ్లు కుప్పకూలిపోయారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే వీరంతా అనారోగ్య బారిన పడ్డారని తేలింది. భారత్‌తో వన్డేలో సెంచరీ చేసి 25 ఓవర్లపాటు ఫీల్డింగ్ చేసిన డి.కాక్ కూడా ఒక్కసారిగా ఆరోగ్యం దెబ్బ తినడంతో హాస్పిటల్ చేరాడు. అంతకుముందు స్వల్ప అనారోగ్యంతో మ్యాచ్ నుంచి దూరంగా ఉన్న ముగ్గురు క్రికెటర్లు.. ఇప్పుడు 10 మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో వారు మైదానంలో దిగాల్సి వచ్చింది. అప్పటికీ ఆటగాళ్లు సరిపోకపోవడంతో.. భారత ఆటగాడు మన్‌దీప్ సింగ్ సౌతాఫ్రికా జెర్సీతో ఫీల్డింగ్ చేయడం విశేషం!

మరోవైపు.. ఆటగాళ్లంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆసీస్‌తో మ్యాచ్ ఆడలేమని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు ఆసీస్‌తో భారత్ బరిలోకి దిగేందుకు కోచ్ ద్రవిడ్ అంగీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south africa  india  tri series match  

Other Articles