AUS 47/9 | Live Cricket Score Updates England vs Australia, Ashes 2015: ENG vs AUS 3rd Test, Day 1 at Trent Bridge

Australias ashes defence in tatters

Australia's Ashes defence in tatters, Ashes 2015, Australia, ENG vs AUS, England, England VS Australia, England,Australia,Stuart Broad,Trent Bridge, Nottingham,The Ashes 2015,Cricket The Ashes: Stuart Broad's Best Test Figures of 8/15 Bowls Australia Out For 60 latest The Ashes 2015 news

Stuart Broad had an unbelievable opening day of the fourth Test at Trent Bridge, where he picked up 8/15, his best Test figures to bowl Australia out for 60, their seventh-lowest total in Tests.

కంగారులకు చమటలు పట్టించిన బ్రాడ్.. 60 పరుగులకే అసీస్ అలౌట్

Posted: 08/06/2015 07:31 PM IST
Australias ashes defence in tatters

యాషస్ సిరీస్ ను సమం చేయాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో కంగారులు ముచ్చెటలు పట్టాయి. ఒకరి తరువాత ఒకరు వరుసగా పెవీలియన్ కు క్యూ కట్టడంతో పీకల్లోతు కష్టాల్లో పడిన అస్ట్రేలియా.. కేవలం 60 పరుగలను మాత్రమే సాధించి చాపచుట్టేసింది. నాల్గో టెస్టులో భాగంగా ఇవాళ ప్రారంభమైన మ్యాచ్ లో అసీస్ ను స్టువర్ట్ బ్రాడ్ చావుదెబ్బ తీశాడు. నిత్యం ప్రత్యర్థి జట్లను కంగారు పెట్టించే అసీస్ ను ఇంగ్లాండ్ బౌలర్ సువర్ట్ బ్రాడ్ ఘోర పరాభవాన్ని చవిచూసేలా చేశాడు.

అసీస్ తన కెరీర్ లో ఎరుగని ఘోర పరాజయాన్ని బ్రాడ్ తన బంతులతో లిఖించాడు. యాషెస్ నాల్గో టెస్టులో తన ప్రతాపం చూపాడు. 13 ఓవర్లలో 46 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా... ఖాతా తెరవకుండానే ముగ్గురు బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కు చేర్చారు. స్టువర్ట్ బ్రాడ్ ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 9.3 ఓవర్లలో ఐదు మెయిడెన్లలతో సహా 15 పరుగులు మాత్రమే ఇచ్చిన బ్రాడ్ ఎనిమిది వికెట్లను తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. మూడో టెస్టులో ఇంగ్లండ్ కు దాసోహమైన ఆసీస్.. మరోసారి అదేస్థాయిలో ఆట తీరును కొనసాగించింది.  

ఆసీస్ ఆటగాళ్లలో తొమ్మిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. ఆసీస్ ఆటగాళ్లలో మిచెల్ జాన్సన్ (13) స్కోరే అత్యధికం. కాగా ఆసీస్ కు ఎక్స్ ట్రాల రూపంలో వచ్చిన 14 పరుగులు లభించడంతో స్కోరు 60 పరుగులకు చేరకుంది. ఇప్పటికే ఇంగ్లండ్ 2-1 తేడాతో ముందంజంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ కు ఓటమి ఎదురైతే మాత్రం ఇంకా టెస్టు మిగిలిఉండగానే సిరీస్ ను కోల్పోవల్సి వస్తుంది.
తాజాగా ఏడు వికెట్లతో ఆకట్టుకున్న బ్రాడ్ మూడొందల వికెట్ల క్లబ్ లో చేరాడు. జట్టు తరుపున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్ గా రికార్డు సాధించాడు. తన కెరీర్ లో 83 వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నబ్రాడ్ 307 వికెట్లు తీశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashes 2015  Australia  ENG vs AUS  England  England VS Australia  

Other Articles