Twenty20 cricketers in hospital after violent clash while going for catch

Moises henriques rory burns collide in cricket outfield collision

Moises Henriques, Rory Burns collision in cricket outfield, Australia National Cricket Team (Cricket Team), sports news, sports latest news, cricket news, Moises Henriques, Moises Henriques latest updates, Rory Burns, players, down, t 20 criket match, Moises Henriques, Arundel, sport, cricket

Two cricketers were knocked unconscious when they collided in an English county match on Sunday and were taken to a hospital in ambulances that had come onto the field.

కౌంటీ క్రికెట్ లో క్యాచ్ పట్టబోయి తలపడ్డ క్రికెటర్లు.. ఇద్దరికి తీవ్రగాయాలు

Posted: 06/15/2015 01:28 PM IST
Moises henriques rory burns collide in cricket outfield collision

గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన అస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం ఫిలిప్ హ్యూస్ ప్రమాద ఘటన ఇప్పటికీ ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానుల స్మృతిపథం నుంచి తోలగిపోకముందే.. మరో ప్రమాదఘటన ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో చోటుచేసుకుంది. అస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ప్రత్యర్థి బౌలర్ విసిరిన ఫుల్ లెన్త్ బౌన్సర్ బంతిని పుల్ షాట్ కోట్టబోయి విఫలమై.. అది తలకు తగిలి సృహ కోల్పోయి.. కోమాలోకి జారుకుని పరపదించిన విషయం పాఠకులకు విధితమే. అయితే ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో మాత్రం అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

నాట్ వెస్ట్ టి 20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా అరుండేల్ మైదానంలో ససెక్స్, సర్రే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఫీల్డింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్మన్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే ప్రయత్నంలో ఎదురెదురుగా ఢీకొన్ని ఆటగాళ్లు తీవ్రంగా గాయపడి మైదానంలో కుప్పకూలిపోయారు. అరెండెల్ వేదికగా సర్రే, సస్సెక్స్ జట్ల మధ్య జరుగిన డొమెస్టిక్ టీ 20 మ్యాచ్లో.. సర్రే ఆటగాళ్లు మోసెస్ హెన్రిక్స్, రోరీ బర్న్స్ తీవ్రంగా గాయపడటంతో జట్టు మేనేజర్లు హుటాహుటిన ఆంబులెన్స్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మ్యాచ్ను నిలిపివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం ఆటగాళ్లకు ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గడిచిన కొద్ది నెలలుగా మైదానంలో క్రికెట్ ఆటగాళ్ల మరణవార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన నేపథ్యంలో తాజా ప్రమాదంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆస్ట్రేలియన్ అయిన మోసెస్ హెన్రిక్స్ ఐపీఎల్- 8లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రస్తుత తరుణంలో క్రీడాకారులు చిన్న చిన్న తప్పనిసరి పద్దతులను ఆచరించడకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని క్రికెట్ దిగ్గజాలు పేర్కోంటున్నారు. క్యాచ్ ను పట్టే వీలుందని తెలిసిన క్రమంలో ఫిల్డర్లు లీవ్ ఇట్ అనే పదాన్ని వాడి వుంటే.. ఒకరే దానిని అందుకునేందుకు ప్రయత్నించేవారని, దీంతో ప్రమాదం జరగేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : players  down  t 20 criket match  Moises Henriques  Arundel  sport  cricket  

Other Articles