Lalit Modi tweeted Four Chennai Super Kings players involved fixing | Ipl Fixing controversy

Four chennai super kings players involved fixing lalit modi

lalit modi news, chennai super kings team, lalit modi controversy, lalit modi chennai news, chennai super kings controversy, mahendra singh dhoni, dhoni updates, dhoni photos, dhoni controversy

Four Chennai Super Kings players involved fixing Lalit Modi : Former Indian Premier League (IPL) commissioner Lalit Modi has woken up the 'fixing' monster once again by saying that at least four Chennai Super Kings (CSK) players are part of the cash-rich league that is struggling to rid itself of corruption.

సుప్రీంకోర్టు దగ్గరున్న జాబితాలో.. నలుగురు చెన్నై ఫిక్సర్లు!

Posted: 05/14/2015 09:33 AM IST
Four chennai super kings players involved fixing lalit modi

ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ తన సంచలన వ్యాఖ్యలతో ప్రస్తుత ‘ఐపీఎల్’కి ధడ పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని టార్గెట్ చేస్తూ ‘ఫిక్సింగ్’ ఆరోపణలు చేయడం సంచలనంగా మారుతోంది. ఇటీవలే చెన్నై జట్టులో ఫిక్సింగ్ జరగుతోందని ఆ జట్టు మీద ఆరోపణలు చేసిన ఈయన.. మరోసారి ఆ తరహాలోనే అందరికీ ఆశ్చర్యం కలిగేలా సంచలన కామెంట్లు చేశారు.

ప్రస్తుతం లండన్ లో నివాసముంటున్న లలిత్ మోడీ.. చెన్నై జట్టులోని నలుగురు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సర్లని ట్వీట్ చేశారు. ‘సుప్రీంకోర్టు దగ్గర ఫిక్సింగ్ కు పాల్పడిన ఆటగాళ్ల జాబితా వుంది. అది బయటపడితే.. కనీసం నలుగురు చెన్నై ఆటగాళ్లు వుంటారు’ అని ఆయన పేర్కొన్నారు. ఆ జాబితాలో భారత్ తోపాటు విదేశీ ఆటగాళ్లు కూడా వున్నారని ఆయన అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లోనూ ముఖ్యంగా చెన్నై జట్టులో ఫిక్సింగ్ జరుగుతోందని ఆయన విమర్శలు చేశారు.

ఇటీవలే లలిత్ మోడీ ఈ విధంగా చెన్నై జట్టు మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో రాయ్ పూర్ పోలీసులు మంగళవారం రాత్రి చెన్నై తరఫున హోయలొలికించే చీర్ లీడర్స్ నివసించే గదులపై దాడులు చేశారు. వీరిలా విచారణ జరపడం దేశవ్యాప్తంగా దుమారం రేగింది. మరి.. తాజాగా ‘ఫిక్సింగ్’ లలిత్ చేసిన కామెంట్లకు ఏ విధమైన స్పందన వస్తుందోనని అంతా అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalit modi  chennai super king  ipl fixing  

Other Articles