yuvraj singh defends virat kohli flop show against australia in semis

Yuvraj singh defends virat kohli

virat kohli, yuvraj singh, private life of a cricketer should be respected, India vs Australia, team india captain MS Dhoni, icc cricket worldcup-2015, semi final, In dia versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

indian allrounder yuvraj singh defends virat kohli, says private life of a cricketer should be respected

క్రికెటర్ల వ్యక్తిగత జీవితాన్ని అభిమానులు గౌరవించాలి

Posted: 03/30/2015 08:19 PM IST
Yuvraj singh defends virat kohli

ప్రపంచకప్ సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనకు అనుష్క శర్మను బాధ్యురాలిని చేస్తూ సామాజిక మీడియాలో వెల్లువెత్తున్న విమర్శలపై భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. కోహ్లీ, అనుష్కల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాన్ని అభిమానులు గౌరవించాలని సూచించాడు. వారిదే కాదు ఏ క్రికెటర్ వ్యక్తిగత జీవితానికి ఆటకు ముడి పెట్టకూడదని హితవు పలికాడు. వర్డల్ కప్ సెమీ ఫైనల్స్ లో విరాట్ రాణించలేకపోవడానికి అనుష్కకు సంబంధం లేదని చెప్పాడు. కావాలని ఏ క్రికెటర్ ఔట్ కాడని చెప్పుకోచ్చాడు.

అసీస్ గడ్డపై విరాట్ కోహ్లీ రాణించిన విషయాన్ని అభిమానులు మర్చిపోరాదని, అసీస్ భారీ స్కోరు నేపథ్యంలో నెలకోన్న ఒత్తిడి కారణంగా కోహ్లీ ఔట్ అయ్యాడని వెనకేసుకోచ్చాడు. త్వరలోనే విరాట్ కోహ్లీ ఫామ్ ను అందిపుచ్చుకుని భారత్ కు విజయాలను అందిస్తాడని యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. సెమీస్ లో ఇరగదీస్తాడనుకున్న కోహ్లి.. అభిమానుల భారీ అంచనాలను పటాపంచలు చేశాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ మ్యాచ్కు అనుష్క రావగడంతోనే కోహ్లీ సరిగా ఆడలేకపోయాడన్న విమర్శలను యువరాజ్ సింగ్ తోసిపుచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Australia  virat kohli  yuvraj singh  

Other Articles