Coezter s ton in vain as bangladesh beat scotland

Coezter's ton in vain as Bangladesh beat Scotland, Scotland's first World Cup century, Kyle Coetzer, Bangladesh beat Scotland, ICC Cricket World Cup 2015, world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Bangladesh, bangladesh CWC 2015, Live Scores, Live Updates, scotland, scotland CWC 2015, Sports, World Cup Live

Kyle Coetzer stroked Scotland's first World Cup century to fire his team to an impressive 318. However, his ton went in vain as Bangladesh registered an easy win.

కోయెట్జర్ సెంచరి వృధా.. స్కాట్లాండ్ పై బంగ్లా గెలుపు..

Posted: 03/05/2015 05:39 PM IST
Coezter s ton in vain as bangladesh beat scotland

ప్రపంచకప్ క్రికెట్ టార్నమెంటులో రెండు చిన్న జట్ల పోరు కూడా ఎలాంటి ఉత్కంఠకు తెరతీయకుండా ఏకపక్షంగా సాగింది. పూల్ ఏలోని స్కాట్లాండ్ బంగ్లాదేశ్ మధ్య సాగిన పోరులో బంగ్లా ఆటగాళ్లు పై చేసి సాధించారు. ఆరు విక్కెట్ల తేడాతో స్కాట్లాండ్ పై విజయం సాధించారు. నిర్ణీత 50 ఓవర్ల 318 పరుగులు చేసిన స్కాట్లాండ్.. 319 పరుగుల భారీ లక్షాన్ని బంగ్లాదేశ్ ముందు పెట్టినా.. ఏ మాత్రం కంగారుపడిన బంగ్లదేశ్ ఆటగాళ్లు అలవోకగా ఛేదించింది. నలుగురు బ్యాట్స్ మెన్ అర్థసెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ మరో 11 బంతులు మిగులుండానే విజయాన్ని అందుకుంది. తమీమ్ ఇక్బాల్(95),  మహ్మదుల్లా(62) నిలకడగా ఆడగా... ముష్ఫికర్ రహీం(60), షకీబ్(52) వేగంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినా.. బౌలర్లు విఫలం కావడంతో స్కాట్లాండ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బంగ్లా బ్యాట్స్ మెన్ జోరును బౌలర్లు అడ్డుకోలేపోయారు. బౌలింగ్ లో తేలిపోయిన సాట్కాండ్ బ్యాటింగ్ లో ఆకట్టుకుంది. ముఖ్యమంగా కోయెట్జర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ తరపున ఈ టార్నమెంటులో తొలి సెంచరీ సాధించాడు. జట్టు స్కోరును 318కి చేర్చడంలోనూ ముఖ్యభూమిక పోషించాడు. ఓటమితో కోయెట్జర్ కెరీర్ బెస్టు వన్డే స్కోరుగా నమోదైన 156 పరుగులు వృధాగా మారాయి.

45వ ఓవర్లో కెయెట్జర్ అవుట్ అయిన తరువాత సహచరులు వరుసగా పెవిలియన్ చేరడంతోనే సరిపోయింది. అయితే స్కాట్లాండ్ మూడోవ సారి భారీ స్కోరును సాధించింది. గతంలో రెండు పర్యాయాలు మూడ వందల స్కోరుబోర్డును దాటింది. 2011లో ఐర్లాండ్ పై, ఆ తరువాత గత ఏడాది కెనడా జట్లపై ఈ భారీ స్కోరును స్కాట్లాండ్ సాధించింది. అయితే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా మాత్రం  కోయెట్జర్ నే ఎంపికచేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  Bangladesh  Scotland  Kyle Coetzer  

Other Articles