Pakistan beats uae by 129 runs

ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Ahmed Shehzad, Haris Sohail, Misbah-ul-Haq Pakistan, Pakistan CWC 2015, Live Scores, Live Updates, united arab emirates, united arab emirates CWC 2015, Sports, World Cup Live

Pakistan trump UAE by 129 runs to register their second victory in world cup 2015.

యూఏఈపై పాక్ గెలుపు.. తొలిసారి భారీ స్కోరు

Posted: 03/04/2015 05:48 PM IST
Pakistan beats uae by 129 runs

ప్రపంచ కప్ టార్నమెంటులో తన ఆటతీరుపై ఇంటా భయట తీవ్ర విమర్శలను ఎదుర్కోన్న పాకిస్థాన్.. లీగ్ దశలో తన స్థానాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. భారత్, వెస్టీండీస్ లతో జరిగిన తొలి రెండు మ్యాచ్లలో చిత్తుగా ఓడిపోయి అభాసుపాలై.. విమర్శలను ఎదుర్కోంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు చిన్న జట్లపై రాణించి నాకౌట్ దశకు చేరుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ.. ఆ దిశగా ఫలితాలను సాధిస్తోంది.

జింబాబ్వేపై తీవ్ర వ్యయప్రయాసల అనంతరం అతికష్టం మీద నెగ్గి బోణీ కొట్టిన పాక్.. తాజాగా పసికూన యూఏఈపై ప్రతాపం చూపించింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో పాక్ 129 పరుగులతో యూఏఈపై విజయం సాధించింది. దీంతో ప్రపంచ కప్ నాకౌట్ అవకాశాల్ని కాపాడుకుంది. తొలుత నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసి పాక్.. యూఏఈని 50 ఓవర్లలో 210/8 స్కోరుకు కట్టడి చేసింది. కాగా 2016 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తొలిసారిగా తన స్కోరును 300 మార్కు దాటించడం ఇదే ప్రధమం.

టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. 10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన కష్టాల్లో కూరుకుపోగా మరో ఓపెనర్ అహ్మద్ షెహజాద్(93), హారిస్ సొహైల్(70) అర్థ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 166 బంతుల్లో 150 పరుగులు జోడించారు. వీరు అవుటైన తర్వాత మఖ్సూద్, మిస్బా బ్యాట్ ఝుళిపించారు. మక్సూద్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. మిస్బా 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. చివర్లో ఆఫ్రిది 8 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ తో 21 పరుగులు చేశాడు.

340 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. ఖుర్రం ఖాన్, షైమన్ నాలుగో వికెట్కు 83 పరుగులు జోడించి కాసేపు వికెట్లపతనాకి అడ్డుకట్ట వేశారు. షైమన్ (62) హాఫ్ సెంచరీ చేయగా,  ఖుర్రం ఖాన్ (43) కొద్దిలో చేజార్చుకున్నాడు. చివర్లో అంజాద్ (40), స్వప్నిల్ పాటిల్ (36) రాణించారు. పాక్ బౌలర్లు సొహైల్ ఖాన్, అఫ్రీది, వాహబ్ రియాజ్ రెండేసి వికెట్లు తీశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  Pakistan  united arab emirates  

Other Articles