Indias batting versus south africas bowling says kohli

India's batting versus South Africa's bowling, says Kohli, AB de Villiers, Cricket, CWC 2015, Dale Steyn, David Miller, ICC World Cup 2015, India CWC 2015, Mahendra Singh Dhoni, South Africa CWC 2015, Sports, Virat Kohli, World Cup West Indies v Pakistan, WI v Pak, Pakistan v West Indies, Pak v WI, ICC Cricket World Cup 2015, World Cup 2015 ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Russel, Cricket, CWC 2015, West Indies, West Indies CWC 2015, pakistan CWC 2015, Sports, World Cup

Indian vice-captain Virat Kohli predicts an "exciting" tussle between his team's batsmen and South Africa's bowlers during Sunday's World Cup blockbuster at the Melbourne Cricket Ground.

సఫారీల బౌలింగ్ కు మన భ్యాటింగ్ కు మద్య పోటీ..

Posted: 02/21/2015 06:06 PM IST
Indias batting versus south africas bowling says kohli

ప్రపంచ కప్ టార్నమెంటులో భాగంగా రేపు (ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరగనున్న రెండో మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితమైనదని భారత్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. భారత బ్యాటింగ్ కు సఫారీలో బౌలింగ్ కు మధ్య పోటీగా ఈ మ్యాచ్ నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ఆదివారం నాడు మెల్బోర్న్ క్రికెట్ గౌండ్స్ లో జరగనున్న భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ లో ఇరుజట్లు సమాతుల్యతతోనే వున్నాయని, అయితే ఎవరు ఎలాంటి ఆటతీరును ప్రదర్శిస్తారన్న దానిపైనే విజయం అధారపడి వుంటుందని విరాట్ అభిప్రాయపడ్డారు.

సౌత్ అఫ్రికాతో మ్యాచ్ కు ముందు.. జట్టు సారధి మహేంద్ర సింగ్ దోణికి బదులుగా వచ్చిన కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యర్థి జట్టులో మంచి బౌలర్లు ఉన్నారు. అదీ కాక వారికి వారి బౌలింగ్ కు వర్ల్డ్ కప్ వేదికైన అస్ట్రేలియా, న్యూజీలాండ్ పిచ్ లు చాలా అనుకూలిస్తాయన్నారు. అదే విధంగా టీమిండియా బ్యాటింగ్లో పటిష్టంగా రాణిస్తోందన్నారు. సఫారీ ఆటగాళ్లలో డేల్ స్టెయిన్, ఏబీ డివిలియర్స్తో ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అనుభవం టీమిండియాకు కలిసొస్తుందన్నారు. డేల్ తనకు మంచి మిత్రుడు. తామిమిద్దరం కలిసినప్పుడు ఆలింగనం చేసుకుంటామన్నారు. అయితే మైదానంలో మాత్రం ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికే ప్రయత్నిస్తామని చెప్పారు.

ప్రపంచ ఫాస్టెస్ట్ బౌలర్లలో డేల్ స్టెయిన్ ప్రమాదకరి బౌలర్ అని పేర్కోన్న కోహ్లీ, విధ్వంసకర బ్యాట్స్ మెన్లలో డివిలియర్స్ ఒకరని తెలిపారు.. అయితే అలాంటి జట్టును ఓడించేందుకు తమ జట్టు సమర్థంగా ప్రణాళిక వేసుకుందని, దాని ప్రకారం వెళ్తే విజయం వరిస్తుందని చెప్పారు.. మెల్ బోర్న్ గ్రౌండ్కు వచ్చే 80 వేల మంది ప్రేక్షకులల్లో 80 శాతం భారతీయ అభిమానులే. కనుక జట్టు మొత్తం సమర్థంగా సఫారీలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది" అని విరాట్ కోహ్లి అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  South Africa  India  Virat Kohli  

Other Articles