Mccullum southee blow away england

england versus newzealand match, england vs newzealand, brendon mccullum, southee, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Brendon McCullum, Cricket, CWC 2015, England, England CWC 2015, Eoin Morgan, James Anderson, Live Scores, Live Updates, New Zealand, New Zealand CWC 2015, Sports, World Cup Live

What a performance from Southee! 7/33 which included four bowleds. Outstanding spell of swing bowling. The ball kept on swinging and Southee used it to great advantage

సౌతీ, మెక్ కల్లమ్ అద్భుతం.. ఇంగ్లాండ్ పై కివీస్ విజయం ..

Posted: 02/20/2015 12:15 PM IST
Mccullum southee blow away england

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ లో భాగంగా పూల్ ఏ కు చెందిన న్యుజిలాండ్ తన అద్భుతమై ఆటతీరును ప్రదర్శించింది. ఇటీవల పసికూన స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం కోసం చాలా శ్రమించిన అతిథ్యజట్టు న్యూజీలాండ్..  ఇంగ్లాండ్ తో పోరులో మాత్రం అదరగోట్టింది. న్యూజీలాండ్ సీమర్ సౌతీ తన అద్బుథ బౌలింగ్ తో ఏడు విక్కెట్లను పడగొట్టాడు. ట్యాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఆరంభం నుండే సౌతీ దెబ్బకోట్టాడు. సౌతీ వన్ మెన్ షో కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెంబేలెత్తారు.

సౌతీ బంతుల ధాటికి విలవిలలాడిన ఇంగ్లాండ్ జట్టు క్రమంగా పెవీలియన్ కు క్యూ కట్టారు. నిర్ణీత యాభై ఓవర్లకు గాను ఇంకా పదహారు ఓవర్లు మిగిలి వుండగానే అలౌట్ అయ్యారు. టాప్ ఆర్డర్ కొంత పరవాలేదనిపించినా.. ఓపెనర్లు సహా మిడిల్ ఆర్డర్, టెయిల్ ఎండర్లు సౌతీ బాలింగ్ ముందు కుప్పకూలారు. సౌతీ కేవలం తొమ్మిది ఓవర్లలోనే 7 ఇంగ్లాండ్ విక్కెట్లను కుప్పకూల్చాడు. ఫలితంగా ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. కివీస్ కు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్ ఒక్కడు మాత్రమే రాణించి 46 పరుగులు సాధించాడు. మిగతా ఆటగాళ్లలో ఇద్దరు మాత్రం పది పరుగుల పైన సాధించగా, ఇక మిగతా అందరూ కేవలం పది పరుగుల లోపు మా్రమే సాధించారు. సౌతీ 9 ఓవర్లలో 33 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

అటు ఇంగ్లాండ్ బౌలింగ్ లోనూ చతికిల పడింది. న్యూజీలాండ్ ఓపెనర్ మెక్ కల్లమ్ తన బ్యాట్ ను జుళిపించడంతో కేవలం 12.3 ఓవర్లలో న్యూజిలాండ్ ను విజయం వరిందించింది. ఇంగ్లండ్ తమ ముందు ఉంచిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ రెచ్చిపోయారు. ఇంగ్లీషు బౌలర్లను ఉతికిపాడేశాడు.

గుప్తిల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన మెక్ కల్లమ్ ప్రారంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మెక్ కల్లమ్ కేవలం 25 బంతుల్లో ఎనమిది ఫోర్లు, ఏడు సిక్స్ లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డి 77 పరుగులు సాధించి న్యూజీలాండ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. అ తరువాత గుప్తిల్ కూడా 22 బంతుల్లో 22 పరుగులు చేసి బొల్డ్ అయ్యాడు. ఆ తరువాత కేన్ విలియమ్ సన్, రాస్ టౌలర్ కలసి జట్టును సునాయాసంగా విజయతీరాలకు చేర్చారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  newzealand  england  

Other Articles