Sachin tendulkar comments on rahul dravid and kapil dev in his auto biography playing it my way

sachin tendulkar, sachin tendulkar news, sachin tendulkar playing it my way book, sachin tendulkar latest news, sachin tendulkar auto biography, sachin tendulkar comments rahul dravid, sachin tendulkar comments kapil dev, sachin tendulkar wife anjali, sachin tendulkar children, rahul dravid news, rahul dravid captaincy, kapil dev news

sachin tendulkar comments on rahul dravid and kapil dev in his auto biography playing it my way

ఆత్మకథలో సచిన్ ఆవేదన... ద్రవిడ్, కపిల్ పై ఆగ్రహం...

Posted: 11/07/2014 01:29 PM IST
Sachin tendulkar comments on rahul dravid and kapil dev in his auto biography playing it my way

బారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన 24ఏళ్ల కెరీర్ లో ఇతర ఆటగాళ్ల ద్వారా ఎన్ని ఇబ్బందులకు గురైనగానీ.. తన ఆగ్రహాన్ని నేరుగా వాళ్లమీద ప్రదర్శించలేదు. అసలు జట్టులో కొనసాగుతున్నప్పుడు అతనికి సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు, వార్తలు రాలేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా జట్టులో ఇన్నాళ్లూ కొనసాగాడు. అయితే తన ఆత్మకథ ‘‘ప్లేయింగ్ ఇట్ మై వే’’ పుస్తకంలోమాత్రం అతను ఆనందించిన క్షణాలతోపాటు అనుభవించిన బాధను కూడా పంచుకున్నాడు. ఇదివరకే మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పై సంచలన వ్యాఖ్యలు సంధించి వివాదం సృష్టించిన సచిన్... తాజాగా భారత్ మాజీ కెప్లెన్లు రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్ ల మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

గతంలో ముల్తాన్ టెస్టులో భాగంగా సచిన్ 194 స్కోరు వద్ద నిలకడగా ఆడుతున్న సమయంలో కెప్టెన్ గా వున్న ద్రవిడ్ హఠాత్తుగా డిక్లేర్ ఇచ్చేసిన సంగతి అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ ఘటననే తాజాగా సచిన్ గుర్తుతెచ్చుకుని తన ఆత్మకథలో పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు. ‘‘మేం ముందుగా అనుకున్నదానికంటే ఒక ఓవర్ ముందే డిక్లరేషన్ జరిగింది. ఆ సమయంలో ఇలా చేయడం అర్థమే లేదు. నేను నిరాశతో, బాధతో డ్రెస్సింగ్ రూమ్ కి చేరాను. ఆ సమయంలో నేను చాలా ఆగ్రహంతో వున్నాను. అప్పుడు కోచ్ గా వున్న జాన్ రైట్ వచ్చి తన తప్పేమీ లేదని క్షమాపణ చెప్పారు. అయితే కోచ్ కే తెలియకపోతే సారీ చెప్పడం ఎందుకన్నాను’’.

అలాగే గంగూలీ వచ్చి తనకు తెలీయదంటూ సారీ చెప్పాడు. చివరికి నా మనసులోని అసంతృప్తిని ద్రవిడ్ ముందు ప్రకటించేశాను. అయితే అతను జట్టు గెలుపుకోసం ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ ద్రవిడ్ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ఆ వివరణ నాకు సంతృప్తి చెందలేదు. నేను కూడా జట్టుకోసమే ఆడుతున్నానని. 194 జరుగులు కూడా జట్టుకే ఉపయోగపడతాయని చెప్పాను. ఈ కోపాన్ని నేను మైదానంలో చూపించను కానీ మైదానం బయట నన్ను ఒంటరిగా వదిలేయ్. నేను కోలుకోవడానికి సమయం పడుతుంది’’ అని ద్రవిడ్ తో అన్నట్లు సచిన్ తెలిపాడు.

ఇక కపిల్ దేవ్ గురించి సచిన్ మాట్లాడుతూ.. ‘‘నేను రెండోసారి కెప్టెన్ గా వ్యవహరించిన సమయంలో భారత దిగ్గజం కపిల్ దేవ్ కోచ్ గా వున్నారు. 1999-2000 ఆస్ట్రేలియాలాంటి కఠిన సిరీస్ లో ఆయన నుంచి చాలా ఆశించాను. జట్టు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించడంలో కోచ్‌దే కీలక పాత్ర అని నేను గట్టిగా నమ్ముతాను. అయితే ఆయన మాత్రం అన్నీ కెప్టెన్‌కే వదిలేశారు. మైదానంలో ఉపయోగపడగల వ్యూహ ప్రతివ్యూహాలు, చర్చల్లో ఆయన పెద్దగా పాల్గొనకపోయేవారు. ఒక కోచ్‌గా కపిల్ నన్ను తీవ్రంగా నిరాశపరిచారు’’ అంటూ తన మనసులో వున్న బాధను తెలియపరిచాడు సచిన్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  playing it my way book  rahul dravid  kapil dev  telugu news  

Other Articles