Chennai vs punjab qualifier 2 preview

Chennai vs Punjab Qualifier-2, indian premier league, chennai super kings, kings xi punjab, ms dhoni, glenn maxwell, david miller, suresh raina

Chennai in the second qualifier to book a place in the final of IPL 2014.

పంజాబ్ స్పీడుకు చెన్నై బ్రేకులు వేసేనా ?

Posted: 05/30/2014 11:30 AM IST
Chennai vs punjab qualifier 2 preview

ఒక జట్టేమో ఐపీఎల్ టోర్నీలో అత్యథిక టైటిళ్ళు గెల్చుకున్న జట్టు. మరొక జట్టేమో తొలిసారి ప్లే ఆఫ్ కి చేరుకున్న జట్టు. ఈ రెండు జట్లు నేడు ఫైనల్ కి చేరడానికి తలపడబోతున్నాయి. గత సీజన్లో టాప్ ప్లేస్ లో ఉండి అందరికంటే ముందు ఫైనల్ చేరిన ధోని సేన ఈసారి అగ్ని పరీక్ష ఎదుర్కొంటుంది. పాయింట్ల పట్టికలో వెనకబడటంతో రెండు క్వాలిఫయిర్ మ్యాచ్ లు ఆడాల్సి వస్తుంది. తొలి మ్యాచ్ లో ముంబయిని చిత్తు చేసిన చెన్నై పంజాబ్ తో అమీతుమీ తేల్చుకోవడానికి ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా చేసుకుంది.

ఇక లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగించిన పంజాబ్ కింగ్స్ లెవన్ జట్టు క్వాలిఫయర్ మ్యాచ్ లో కోల్ కత్తా పై చిత్తై ఇంతదాకా తెచ్చుకుంది. ఇప్పటి వరకు వింధ్వంసక ఆటతో చెలరేగుతున్న గ్లెన్ మాక్స్ వెల్ ఆ జట్టుకు ప్రధాన బలం. లీగ్ దశలో చెన్నైని చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్స్ వెల్ ని చెన్నై బౌలర్లు కట్టడి చేస్తే విజయావకాశాలు చెన్నైకి ఉంటాయి. ముంబయిని చిత్తు చేసిన ధీమాలో ఉన్న చెన్నైకి బలం బాగానే ఉంది. స్మిత్, డుప్లెసిస్, మెక్ కల్లమ్, డేవిడ్ హసి, రైనా, ధోనీలతో చెన్నై జట్టు బలంగా ఉంది.

ఇక క్వాలిఫయర్ - 1 లో కోల్ కత్తా పై బ్యాటింగ్ లో డీలా పడిన పంజాబ్ ఈ సారి విజ్రుంభించి తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టాలని చూస్తుంది. పంజాబ్ జట్టులో మ్యాక్స్ వెల్ తో పాటు, సెహ్వాగ్, మిల్లర్, బెయిలీ వోహ్రా, సాహా మెరిస్తే పంజాబ్ ముందు ఎంత లక్ష్యమైనా చిన్నదే అవుతుంది. మరికొన్ని గంటలు ఆగితే ఎవరిది పై చేయి అవుతుందో తేలిపోతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles