Virat kohli suresh raina set up india 20 run win over england

Virat Kohli, Suresh Raina, India, England, World Twenty20 warm-up, ICC World Twenty20 warm-up,WT20, World Cup T20.

Virat Kohli & Suresh Raina set up India 20-run win over England

విజృంభించిన కోహ్లీ-రైనా

Posted: 03/20/2014 10:09 AM IST
Virat kohli suresh raina set up india 20 run win over england

ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్‌కు ముందు శ్రీలంకతో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న భారత జట్టు బుధవారం రెండో వామప్ మ్యాచ్‌లో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా అర్ధ శతకాలతో రాణించి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. 

దీంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు రోహిత్ శర్మ (5), శిఖర్ ధావన్ (14)తో పాటు యువరాజ్ సింగ్ (1) విఫలమవడంతో భారత జట్టు 39 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.

ఈ తరుణంలో విరాట్ కోహ్లీ, సురేష్ రైనా క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు చెరొక అర్ధ శతకాన్ని నమోదు చేయడంతో పాటు నాలుగో వికెట్‌కు 81 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. 

ఆ తర్వాత రైనా (54) రవి బొపారా బౌలింగ్‌లో జోర్డాన్‌కు క్యాచ్ ఇవ్వగా 48 బంతుల్లో 74 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ ధోనీ (21) కలసి అజేయంగా మరో 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది.

దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే రాబట్టిన ఇంగ్లాండ్ జట్టు 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు కైవసం చేసుకోగా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, సురేష్ రైనా ఒక్కో వికెట్ సాధించారు.

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles