Djokovic thrashes Nadal to win sixth China Open title

Djokovic bags china open title

China Open, Novak Djokovic, Rafael Nadal, Sports, SportsTracker, Tennis

Novak Djokovic defeated Rafael Nadal 6-2, 6-2 Sunday to win his sixth China Open title and improve his record at the tournament to a sterling 29-0. Djokovic had seven aces to none for his Spanish rival, and saved both break points he faced in the match, which was the 45th between the two players.

జకోవిచ్ జయభేరి.. నాదల్ పరాభవం

Posted: 10/12/2015 03:49 PM IST
Djokovic bags china open title

నోవాక్ జకోవిచ్ తన విజయ దుందుభిని కొనసాగిస్తున్నారు. రఫెల్ నాదల్ ను సునాయాసంగా ఓడించి ఆరో చైనా ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. టోర్నిలో జకోవిచ్ 29-0 తేడాతో గెలిచారు. కాగా అందరూ నాదల్ జకోవిచ్ దూకుడుకు కళ్లెం వేస్తాడని అనుకున్నా. ఫీల్డ్ లో మాత్రం నాదల్ వెనుకబడిపోయారు. మొదటి సెట్ లో పెద్దగా రసవత్తరంగా అనిపించకపోయినా.. తర్వాత మాత్రం ఇద్దరి మధ్య పోరు తారా స్థాయి చేరిందని జకోవిచ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను తన దూకుడును, శక్తిపి మొదటినుండి ఒకేలా మెంటెన్ చేయడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. జకోవిచ్ ను నాదల్ 2013 యుఎస్ ఓపెన్ ఫైనల్ నుండి ఓడించలేకపోయారు. చివరగా ఫ్రెంచ్ ఓపెన్ లోనూ నాదల్ ఓడిపోయారు. మొత్తానికి జకోవిచ్ మాత్రం నాదల్ మీద పైచేతి సాధించి తన గెలుపు బావుటాను ఎగరవేశారు.

తన కన్నా ఎన్నో రెట్లు కాన్ఫిడెన్స్ తో నాదల్ పర్ఫామెన్స్ తనకు చాలా నచ్చిందని నాదల్ జకోవిచ్ ఆటను మెచ్చుకున్నారు. గత కొంత కాలంగా జకోవిచ్ గెలుస్తూనే ఉన్నారు. గత ఆరు సంవత్సరాలుగా కేవలం మూడు సెట్లలో మాత్రమే ఓటమి చెందారు. షాంఘై కోసం ఈ మ్యాచ్ తనకు ఎంతో మంచి అనుభవాన్ని మిగిల్చిందని నాదల్ వివరించారు. జకోవిచ్ తన కెరీర్ లో బెస్ట్ ఫాంలో ఉన్న టైంగా పేర్కొన్నారు. మొత్తానికి తాజాగా టైటిల్ తో జకోవిచ్ తన కెరీర్ లో బెస్ట్ ర్యాంకింగ్ కు కూడా ఎగబాకారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China Open  Novak Djokovic  Rafael Nadal  Sports  SportsTracker  Tennis  

Other Articles