balaji new national tennis champion prerna keeps her title

Sriram prerna clinch national tennis titles

Tennis N. Sriram Balaji New National Men's Champion, Prerna Bhambri Defends Women's Title, Sriram Balaji, Vishnu Vardhan, final, Prerna Bhambri, Samitha Sai Chamarthi, latest Tennis news

N. Sriram Balaji defeated Vishnu Vardhan in the final, while Prerna Bhambri got the better of Samitha Sai Chamarthi.

శ్రీరామ్ బాలాజీ.. టెన్నీస్ యువ ఆశాకిరణం

Posted: 10/11/2015 03:51 PM IST
Sriram prerna clinch national tennis titles

భారత టెన్నిస్ చరిత్రలో మరో యువ కెరటం వచ్చి చేరింది.  ఫెనెస్టా ఓపెన్ లో భాగంగా ఇక్కడ ఆర్కే ఖన్నా స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఎన్ శ్రీరామ్ బాలాజీ సరికొత్త జాతీయ చాంపియన్ గా అవతరించాడు.  టాప్ సీడ్ గా బరిలోకి దిగిన బాలాజీ తుది పోరులో సెకెండ్ సీడ్ విష్ణు వర్ధన్ ను బోల్తా కొట్టించాడు.  హోరాహోరీగా సాగిన పోరులో బాలాజీ 7-5, 6-3 తేడాతో విష్ణు వర్ధన్ పై గెలిచాడు.  దీంతో  2016 లో జరిగే ఢిల్లీ ఓపెన్ లో బాలాజీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది.
 
గత ఆరు సంవత్సరాల నుంచి జాతీయస్థాయిలో ఆడుతున్న బాలాజీ చాంపియన్ గా నిలవాలన్న కలను ఎట్టకేలకు సాకారం చేసుకున్నాడు. ఇప్పటికే తన సహచరుడు వీఎమ్ రంజిత్ తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ ను సాధించిన బాలాజీ.. సింగిల్స్ లో కూడా  తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా మహిళల సింగిల్స్ టైటిల్ ను డిఫెండింగ్ చాంపియన్ పెర్నా బాంబ్రీ నిలబెట్టుకుంది.  తుది సమరంలో సమితా సాయి చమర్తిని కంగుతినిపించి టైటిల్ ను కాపాడుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sriram Balaji  tennis champion  Prerna Bhambri  Vishnu Vardhan  

Other Articles