The glorious history of upa pandavas

upa pandavulu, upa pandavula history, hindu devotional articles, hindu traditional articles, Saptha Rushulu, hindu mythology, Ashtavakra, Anoorudu, Upa Pandavulu, the history of upa pandavas, upa pandavula story, upa pandavulu history in telugu, the history of upa pandavas in telugu, maha bharat, maha bharatham, maha bharat in telugu, pandavulu, the history of arjuna, the history of krishna

The glorious history of upa pandavas

కురుక్షేత్రంలో ఉపపాండవుల విన్యాసం

Posted: 06/14/2014 03:18 PM IST
The glorious history of upa pandavas

(Image source from: The glorious history of upa pandavas)

పాండవులు, ద్రౌపదికి కలిగిన ఐదుగురు సంతానాన్ని ఉప పాండవులగా పిలుస్తారు. పాండవులకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పుత్రుడు జన్మించారు.

1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)
2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)
3. శ్రుతకర్ముడు - (అర్జునుని పుత్రుడు)
4. శతానీకుడు - (నకులుని పుత్రుడు)
5. శ్రుతసేనుడు - (సహదేవుని పుత్రుడు)

పూర్వజన్మలో ఈ ఉపపాండవులు ‘‘విశ్వులు’’ అనే దేవతలుగా వుండేవారు. వీరు ఈ విధంగా ఉపపాండవులుగా జన్మించడానికి ఒక పురాణకథనం కూడా వుంది. పూర్వం ఒకనాడు హరిశ్చంద్రుని భార్య అయిన చంద్రమతిని నగరం వదిలి వెళ్లాల్సిందిగా విశ్వామిత్రుడు శపిస్తాడు. అది చూసిన ఈ విశ్వవులు.. ‘‘ఋషులకు ఇంత కోపం పనికిరాదు’’ అని అనుకుంటారు. అది విన్న విశ్వామిత్రునికి కోపం మరింతగా పెరిగిపోతుంది. ఆ కోపంతో అతను విశ్వులకు నరులుగా జన్మించమని శపిస్తాడు. ఆ శాపంతోనే వీరు ఉపపాండవులుగా భూమిపై జన్మిస్తారు.

మహాభారతంలోని పాండవులు, కౌరులకు మధ్య జరిగిన కురుక్షేత్రం సంగ్రామంలో ఈ ఉపపాండవుల పాత్ర ఎంతో మెరుగైనది. వీరికి సంబంధించిన ప్రస్తావనలు ఎన్నో వున్నాయి. ఆరవరోజు యుద్ధం జరుగుతున్న సమయంలో కౌరవులు... భీముడు, దృష్టద్యుమ్ములపై ఒకేసారి మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఆ సమయంలో పాండవుల పుత్రులయిన ఈ ఐదుగురు ఉపపాండవులు తమ పరాక్రమ బలంతో కౌరవులను పరుగులు తీయించారు. అందులో ముఖ్యంగా నకులునీ కుమారుడు అయిన శతానీకుని విన్యాసం ప్రతిఒక్కరిని మెప్పించింది. అలాగే పదహారవరోజు యుద్ధంలో ధర్మరాజు కుమారుడు అయిన ప్రతివింధ్యుడు తోమరంతో కౌరవ వీరుడైన చిత్రసేనని చంపేశాడు. వారు అతనిపై ప్రతిఘటించినప్పటికీ... అతనిని ఓడించలేకపోయారు.

మరోవైపు... ద్రోణాచార్యుని కుమారుడు అయిన అశ్వత్థామ ఈ ఉప పాండవులను సంహారం చేస్తానని కౌరవ రాజు అయిన దుర్యోధనునికి మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారం అశ్వత్థామ ఈశ్వరదత్తమైన ఖడ్గంతో రాత్రి సమయంలో రహస్యంగా దాడిచేశాడు. ప్రతివింధ్యున్ని అడ్డంగా నరికేశాడు. శ్రుతసోముడి గొంతకోసి అతికిరాతకంగా చంపేశాడు. అర్జునుని కుమారుడు అయిన శ్రుతకర్ముని తలను నరికి, మొండాన్ని కాలుతో తన్నాడు. అలాగే నకులుడు, సహదేవుని కుమారులైన శతానీకుని, శ్రుతసేనుని దారుణంగా తలలు నరికి చంపేశాడు. ఈ విధంగా ఆ రాజు రాత్రి అశ్వత్థామ, కృతవర్మం, కృపాచార్యుడు ముగ్గురు కలిసి ధృష్టద్యుమ్నుడి శిబిరంలో పాండవ సేనను ఘోరంగా చంపేశారు.

ఈ విధంగా ఉపపాండవుల ప్రస్థానం కురుక్షేత్రంలో అర్థాంతరంగా సమసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భీమార్జునులు వెంటనే అశ్వత్థామను పట్టుకుని, శిక్షించబోయారు. కానీ అతను గురువు పుత్రుడన్న ఒకే ఒక కారణంతో చంపకుండా.. అతని తలపైనున్న సహజసిద్ధమణిని తీసుకుని వదిలేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • King mandhata defeated ravan in big war

    రావణాసురుడిని ఓడించిన మాంధాత

    Nov 13 | రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు.... Read more

  • Jimutavahana special story who sacrifies his life for snake species

    మానవత్వానికి మారుపేరుగా నిలిచిన జీమూతవాహనుడు

    Oct 08 | పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తికి ‘జీమూతవాహనుడు’ అనే కుమారుడు వుండేవాడు.  ఇతను చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజలు,  అన్నిప్రాణుల పట్లా ఎంతో కారుణ్యంతో ఉండేవాడు. రాకుమారుడు అయినప్పటికీ అతనితో అహంకారం వుండేది కాదు. ఇటువంటి... Read more

  • Akroorudu history in mahabharat and sitaram kalyan

    శ్రీకృష్ణుడిని హెచ్చరించిన అక్రూరుడు

    Jul 03 | అక్రూరుడికి సంబంధించిన ప్రస్తావన మహాభారతంలో ప్రచురించబడింది. ఇతిహాస కథలలో కొన్ని విచిత్రమైన పాత్రలు ప్రత్యేకంగా చెప్పబడేవి. అందులో కొన్ని పాత్రలు ద్వంద్వ స్వభావాన్ని కనబరిస్తే... మరికొన్ని పాత్రలు ఇరువర్గాలకు నష్టాన్ని కలిగించేలా వుండేవి. అటువంటి... Read more

  • The glory of saraswati devi in epic

    సరస్వతీదేవి మహిమను తెలిపే ఇతిహాసం

    Jun 10 | సరస్వతీదేవిని ప్రతిఒక్కరు ఎంతో దైవంగా పూజిస్తారు. ఈమెను చదువుల తల్లిగా పేర్కొంటారు. సరస్వతీదేవి సన్నిధిల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి చదువు ఎంతో బాగా లభిస్తుందని, భవిష్యత్తు కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారని, జీవిత ప్రయాణంలో... Read more

  • Srimad bhagavatham vyasam

    శ్రీమద్భాగవతము

    Feb 17 | మొదటి అధ్యాయము :  ఈ జగత్తులో సృష్టి లయానికి కారకుడు, దానికి వ్యతిరేకుడు ఎవరో, ఈ సమస్త జగత్తుకు కర్త ఎవరో, తన సొంత సిద్ధ జ్ఞానముతో విరాజిల్లువాడు ఎవరో, బ్రహ్మదేవునికి కూడా జ్ఞానాన్ని... Read more