Why devotees cut hairs at tirumala

tirumala news, tirumala temple news, devotees cut hairs at tirumala, devotees at tirumala temple, why devotees cut their hairs at tirumala temple, tirumala temple news, telugu traditions, traditions in hindu religion, hindu traditions

why devotees cut their hairs at tirumala temples which can give a good look and more

తిరుమలలో భక్తులు ఎందుకు గుండు చేయించుకుంటారు?

Posted: 04/07/2014 04:40 PM IST
Why devotees cut hairs at tirumala

సాధారణంగా జుట్టు అంటే ప్రతిఒక్కరికి ఇష్టమే. మగవారుకాని, మహిళలుకాని అందంగా కనిపించడానికి జుట్టు తమదైన పాత్రను వహిస్తాయి. జుట్టుకు సంబంధించి రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అనేకరకాలుగా జుట్టును అలంకరించుకుంటారు కూడా! 

జానపదంలో కూడా తల వెంట్రుకల సౌందర్యం కోసం జాగ్రత్తలు తీసుకునే విధానాలు కూడా వున్నాయి. జానపద విజ్ఞానం ప్రకారం తలవెంట్రుకలు ప్రతిఒక్కరికీ అపూర్వం. అంతేకాదు.. వెంట్రుకలను సంపదతో పోల్చి కేశాసంపద అని కూడా పిలుచుకుంటారు. 

ప్రాచీనకాలంలో కురులు ఎంత పొడవుగా పెట్టుకుంటే వారికి అంత విలువు, సంపద లభిస్తుందని భావించేవారు. అందుకే ఆరోజుల్లో మగవారు కూడా జుట్టును పొడవుగా పెంచుకుని, పూలను అలంకరించుకునేవాళ్లు. ముక్కుసూటిగా చెప్పుకోవాలంటే.. మనిషి కురులమీద చూపించే మమకారం మరేదానిమీద కూడా అంతగా చూపించడు. 

ఇంతటి విలువైన ఈ కురులను శ్రీవారి మీదున్న భక్తితో వాటిని తృణప్రాయంగా భావించి సమర్పించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తారు మనుష్యులు. తమ అందం కన్నా శ్రీవారి మీదున్న భక్తి ఎక్కువ అనే ఆనందంలోనే స్వామివారి ఆలయంలో జుట్టును సమర్పించుకుంటారు భక్తులు. 

అలా ఆ విధంగా మొదలయిన ఈ ఆచారం.. కాలం గడిచేకొద్దీ గుండు గీయించుకోవడం ఒక మొక్కుబడిగా మారిపోయింది. రకరకాల మొక్కుబడులతో తిరుమలకు వచ్చి గుండు గీయించుకోవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pilli shakunam

    పిల్లి శకునం

    Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more

  • Why we use silk clothes in every occasion

    పట్టుబట్టలే ఎందుకు..?

    Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more

  • What is the benefit with mounvrath

    మౌన వ్రతం ఎందుకు???

    Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more

  • What is the eft fall sign

    బల్లి శకునం

    Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more

  • Some unbelives actually have scientific reasons

    మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

    Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more