కౌలాస్ కోట
నిజామాబాదు జిల్లాలోని కైలాస్ గ్రామంలో ఈ కోట వుంది. సంగారెడ్డి - నాందేడ్ రహదారిపై వున్న ఈ కోట చుట్టూ.. దట్టమైన అడవి, క్రింద నది ఉండటంతో ఇక్కడి ప్రకృతిదృశ్యం అమెజాన్ అడవిని తలపిస్తుంది. కౌలాస్ కోటకు 57 బురుజులున్నాయి. కోట లోపల అనేక ఆలయాలు, దర్గాలు ఉన్నాయి. కోట ద్వారాలపై చెక్కిన అలంకరణలు, హృద్యంగా చెక్కబడిన హిందూ దేవతాశిల్పాలు ప్రత్యేక ఆకర్షణలు.