గండికోట
కడప జిల్లాకే తలమానికం గండికోట. మూడువైపులా చుట్టూ కొండలు, మరోవైపున లోయలో ప్రవహించే పెన్నా నది. ఇటువంటి అపురూప, అద్భుత దృశ్యకావ్యం గండికోట సొంతం. 40 అడుగుల సింహ ద్వారం, ఏనుగులతో సైతం ఢీ కొట్టించిన చెక్కుచెదరని తలుపులు, దానికున్న ఉక్కు కావచాలు కోట పటిష్టతకు నిలువుటద్దాలు.