అంకాళమ్మ కోట
మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులో విస్తరించి వున్న నల్లమల అడవులలో ఈ కోట వుంది. ఈ అటవి ప్రాంతంలో ప్రవహించే కృష్ణానది మధ్యలో ద్వీపకల్పంలా విస్తరించి ఉన్న భూభాగంలో 600 అడుగుల ఎత్తులో కొండమీద ఈ కోటను నిర్మించారు. ఈ కోటను 16 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది.